తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 9వ వార్డులో వైయస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు (బీరువాల బాబు), 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేవిరెడ్డి ఆదిలక్ష్మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుని అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా నల్లగట్ల సుధారాణి మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తిరువూరు పట్టణ సమస్యలపై అవగాహన, గత పాలనలో అనుభవం ఉన్న పరసా శ్రీనివాసరావును గెలిపించాలని కోరారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ బీసీ నాయకుడైన పరసా శ్రీనివాసరావుకు మద్దతు తెలపాలని, పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావుతో పాటు 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేవిరెడ్డి ఆదిలక్ష్మిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.