ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పద్మ థియేటర్ వెనుక ప్రాంతం, అశోక్‌నగర్, గంగిరెట్ల చెరువు, లచ్చిరెడ్డి కాలనీ వెనుక ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మేక సత్యవతితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజల ఆదరణతో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, కర్పూరం గవరయ్య గుప్తా, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, మేక సింహాద్రి, వందనపు వెంకటేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, వెంప ఐజీ, చనమల శ్రీనివాస్, చింత అనిల్, తల్లాడ నేతాజీ శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.