ఎమ్మిగ‌నూరు ఆసుప‌త్రిలో క‌నీస సౌక‌ర్యాలు క‌రువు

వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక ఫైర్‌

కర్నూలు జిల్లా: ఎమ్మిగ‌నూరు ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రిలో క‌నీస సౌక‌ర్యాలు క‌రువయ్యాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక మండిప‌డ్డారు.  సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర‌వుతున్నా.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం ఆమె ఆసుప‌త్రిని సంద‌ర్శించి, అక్క‌డి ప‌రిస్థితుల‌ను రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు.   అలాగే హాస్పిటల్లో వసతులను, మెడిసిన్ స్టాకును చిన్నపిల్లల వార్డులను జనరల్ వార్డులను,స్కానింగ్ సెంటర్ ను,ల్యాబ్ లను, ఆపరేషన్ థియేటర్లను, కాన్పు వార్డులను  పరివేక్షించారు. బుట్టా రేణుక  మాట్లాడుతూ.. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు, చిన్న పిల్లలకు సంబంధించి డాక్టర్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు దాదాపు రోజుకు 200 మంది చిన్న పిల్లలు జ్వరాలతో హాస్పిటల్ కి వస్తున్నారు కానీ సూపర్ డెంట్ తో పాటు ఇంకొక డాక్టర్ మాత్రమే ఉన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం స్టాఫ్ ను ఇవ్వాలని,ల్యాబ్ లో సంబంధించిన కిట్లు సరిగా లేక టెస్టులు చేసి రిజల్ట్ కొరకు 5  రోజులు వేచి ఉండాలని,100 పడకల హాస్పిటల్లో బెడ్స్,మంచాలు సరిగా లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని,ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ కు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో హాస్పిటల్ కి వస్తారని కనీస సౌకర్యాలు, భోజనాలు చేయడానికి సరైన వసతులు లేవు అని, వచ్చిన ప్రజలు ఓపి తీసుకోవాలంటే ఎండలోను వానలోను తప్పనిసరిగా నిలబడాలని వాటికి షెడ్లు నిర్మించాలని,హాస్పిటల్ చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ లేక పందులు,కుక్కలు హాస్పిటల్ వెలుపులకి  వస్తున్నాయని,హాస్పిటల్ చుట్టుపక్కల చెత్త చెదారులతో నిండి వచ్చిన ప్రజలకు ఇంకా రోగాలు వస్తాయని భయపడుతున్నారని అన్నారు.

 కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ, పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశప్ప, జిల్లా అధికార ప్రతినిధి కే సునీల్ కుమార్, పాల శ్రీనివాసరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు కోటకొండ నరసింహులు, కౌన్సిలర్ నీలకంఠ పట్టణ జనరల్ సెక్రటరీ అల్తాఫ్, చేనేత మల్లికార్జున, మాజీ కౌన్సిలర్ మధుబాబు, నియోజవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు విశ్వనాథ రమేష్,ఎమ్మిగనూరు మండలం యూత్ అధ్యక్షులు బసిరెడ్డి, 5 వ వార్డ్ ఇబ్రహీం, స్టూడెంట్ వింగ్ సోమశేఖర్, బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ మంజునాథ్, తిమ్మాపురం బజారి, కడవెళ్ల ఉరుకుందు,సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ చాందు బాషా, సోషల్ మీడియా ఆసిఫ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top