అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండ‌గా డిజిటల్ బుక్

పెద్ద క‌డుబూరు మండ‌లంలో డిజిట‌ల్ బుక్ ఆవిష్క‌ర‌ణ‌
 

క‌ర్నూలు: అన్యాయానికి గురవుతున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు డిజిటల్‌ బుక్ అండ‌గా ఉంటుంద‌ని పెద్దకడ‌బూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంత్రాల‌యం ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం పెద్ద‌క‌డ‌బూరులో డిజిట‌ల్ బుక్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కూటమి పాలనలో పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో, తప్పుడు కేసులకు బలవుతున్నారో, అలాంటి నాయకులకు, కార్యకర్తలకు అండగా డిజిటల్‌ బుక్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాలను డిజిటల్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అయ్యి డిజిటల్‌ బుక్‌ లో త‌మ ఫిర్యాదుల‌ను  అప్‌లోడ్ చేయాలన్నారు. తద్వారా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మన కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్‌ బుక్‌ అన్నారు.   గారు మీడియా మిత్రులకు సమావేశంలో  అన్నారు.  ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఆర్ శివారెడ్డి  , బ్రహ్మయ్య ఆచారి ,  ముకరన్న ,  బొగ్గుల ఆర్లప్ప, శాంతి మూర్తి,  మొత్రు దస్తగిరి, మొత్రు  ఈరన్న   దయ్యాల మహబూబ్ , ప్రసాద్, రాజు  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top