వైద్య‌, ఆరోగ్య శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ (ఎఫ్‌ఏసీ) అజయ్‌ జైన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి (కోవిడ్‌ 19) మంజుల డి హోస్మణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జె.నివాస్, ఎపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిర ప్రసాద్, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డిఎస్‌విఎల్‌ నరసింహం, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామిరెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ బి.చంద్రశేఖరరెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అదే విధంగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి. కృష్ణబాబు ఈ స‌మీక్షలో పాల్గొన్నారు. 

Back to Top