`పెన్ డ్రైవ్` పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: జర్నలిస్ట్‌ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం `పెన్‌ డ్రైవ్` పుస్తకాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్క‌రించారు. జ‌ర్న‌లిస్టు రెహాన వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్‌ డ్రైవ్‌ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా రెహానను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు. 

Back to Top