నా ప్ర‌తి అడుగులోనూ నాన్నే.. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

పులివెందుల‌:  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ్ఞాప‌కాల‌కు, ఆయ‌న ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మర‌ణం ఉండ‌ద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్‌లో నివాళుల‌ర్పించారు. అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 
నాన్న మ‌న మ‌ధ్య నుంచి దూర‌మై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్క్షాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్ర‌తి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు న‌డిపిస్తూనే ఉన్నార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top