కరోనా నుంచి మానవాళిని రక్షించాలని కరుణామయుడిని పార్ధిద్దాం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌

 
తాడేపల్లి: కరోనా వైరస్‌ నుంచి మానవాళిని రక్షించాలని కరుణామయుడిని మనమంతా ప్రార్థించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం... జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవేనని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ సండే వేడుకల్ని క్రైస్తవ సోదర సోదరీమణులంతా మీ ఇళ్ళలో, మీ కుటుంబంతో  ఘనంగా జరుపుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా  సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top