ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు

ఏపీపీఎస్సీ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం

ప్రతి ఏడాడి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌

అమరావతి: ఉద్యోగాల నియామకాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీపీఎస్సీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయాలని సీఎం నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని అధికారులకు సూచించారు. మరింత పారదర్శకత విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ను విడుదల చేయాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యంపై ఆలోచన చేయాలన్నారు. ప్రతి నోటిషికేషన్‌ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు చెప్పడంతో.. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

Read Also: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం

Back to Top