కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు

కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

ప్రజల్లో కరోనా పట్ల ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలి

తాడేపల్లి: కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా ఎస్‌ఓపీలు రూపొందించాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కరోనా పట్ల ప్రజల్లో ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలన్నారు. భయం, ఆందోళన తగ్గాలంటే ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలన్నారు. కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపడం మానుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో విలేజ్‌ క్లీనిక్స్‌ స్థాయికి కోవిడ్‌ పరీక్షలు జరగాలన్నారు. భౌతిక దూరం పాటించేలా దుకాణదారులే ముందుకొచ్చే పరిస్థితి రావాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాల కీలకపాత్ర పోషించనున్నాయని చెప్పారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విధానం, మార్కెట్‌ ఇంటర్‌వెర్సన్‌ విభాగం చాలా ముఖ్యమైనవని తెలిపారు. ఈ రెండు విషయాల్లో సమర్ధవంతంగా రైతు భరోసా కేంద్రాలు పని చేయాలన్నారు.లోపాలు లేకుండా సమర్ధ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.
 

Back to Top