తాడేపల్లి: రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు సీఎం వైయస్ జగన్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా సీఎం వైయస్ జగన్..‘దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలి. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.