కాసేపట్లో `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం

గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. నేడు గుంటూరు జిల్లాలో బ‌స్సు యాత్ర కొన‌సాగ‌నుంది. ధూళిపాళ్ల నుంచి సీఎం బ‌స్సు యాత్ర ప్రారంభం కానుంది. ధూళిపాళ్ల  రాత్రి బస నుంచి బ‌స్సు యాత్ర బ‌య‌ల్దేరి.. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, VIP రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్,పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు.

Back to Top