వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ప్రారంభం

క్యాంపు కార్యాల‌యంలో లాంఛ‌నంగా ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ చేయుత ప‌థ‌కం ద్వారా 25 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి

వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మ‌హిళ‌ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి

తాడేప‌ల్లి: మ‌హిళా సాధికార‌త దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం మ‌రో  కీల‌క అడుగు వేసింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల‌లోపు వ‌య‌సు గ‌ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు ఆర్థిక చేయూత‌నందించేందుకు రూపొందించిన‌ వైయ‌స్ఆర్  చేయూత పథకాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రితం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ప్రారంభించారు.   ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందజేసే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం కనిపిస్తుంద‌నే ఉద్దేశంతో రాష్ట్రంలోని అర్హులైన 25 లక్షల మంది మ‌హిళ‌ల‌కు వైయ‌స్సార్‌ చేయూత ప‌థ‌కం కింద  ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందుతుంది.   ‘వైయ‌స్సార్‌ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. అనంత‌రం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మ‌హిళ‌ల‌తో సీఎం ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు.  

Back to Top