రెండు సెంట్లు స్థలం కోసం కక్కుర్తి ఎందుకు అయ్య‌న్న‌? 

కోస్తా టైగర్ అని చెప్పుకునే వ్య‌క్తి ఎందుకు దాక్కున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సన్యాసి పాత్రుడు 

అనకాపల్లి: వందల ఎకరాలు దానం చేశామని చెప్పుకుంటున్న అయ్యన్న రెండు సెంట్లు స్థలం కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన సోదరుడు, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ చింతకాయల సన్యాసిపాత్రుడు ప్ర‌శ్నించారు.మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆక్రమించిన రెండు సెంట్లు స్థలం రావనపల్లి రిజర్వాయర్ కాలువకు సంబంధించింది. అయ్యన్న ఆక్రమించిన స్థలంపై రిజర్వాయర్ కమిటీ మొదట్లోనే అభ్యంతరం తెలిపింద‌ని చెప్పారు. అభ్యంతరం తెలిపిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగార‌ని,  వారివి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టార‌ని చెప్పారు. 

రెండు సెంట్లు స్థలం మీదే అయినప్పుడు ఎందుకు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నార‌ని నిల‌దీశారు. ఆదివారం అర్ధరాత్రి పూట స్టేలు తెచ్చుకోవలసిన అవసరం ఏముంద‌ని ప్ర‌శ్నించారు.  కోస్తా టైగర్ అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు దాక్కున్నారు. 276 సర్వేనెంబర్‌లో ఆక్రమించారని అధికారులు చెబుతుంటే మీరు 277 సర్వేనెంబర్ చూపిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి అయ్యన్న కుటుంబం భూములు ఇవ్వలేదు. మా తాత ముత్తాతలు ఇచ్చారు, దానిని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యన్న భార్య మహానటి సావిత్రిని మించి నటించింది. మేము పార్టీ మారినప్పుడు నన్ను నా కొడుకుని చంపించడానికి రౌడీలను పంపారని  చింతకాయల సన్యాసిపాత్రుడు వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top