సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు సీఎస్ కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్‌ స‌మీర్ శ‌ర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్‌ సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. 2022 మే 31 వరకు చీఫ్‌ సెక్రటరీగా డాక్టర్‌ సమీర్‌ శర్మ కొనసాగనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను కేంద్రం జారీచేసింది. ఈ నేప‌థ్యంలో సీఎస్ స‌మీర్ శ‌ర్మ ముఖ్య‌మంత్రిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top