అందరికీ సొంతిల్లు ఉండాల‌న్న‌దే నా లక్ష్యం

పైడివాడ అగ్ర‌హారం స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఇక ఉండ‌బోదు

పేదలకు సొంతిల్లు కల్పించడంలో కులం, మతం, ప్రాంతం చూడలేదు

మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపుమంటతో కొందరు రగిలిపోతున్నారు

కోర్టుకు వెళ్లి పట్టాలు రాకుండా 489 రోజులు దుష్టచతుష్టయం అడ్డుకుంది

దేవుడి దయతో సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది

1.23 ల‌క్ష‌ల మంది అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేస్తున్నాం

మెరుగైన సౌకర్యాలతోనే ఇళ్లు కట్టిస్తున్నాం

అనకాపల్లి: అర్హులంద‌రికీ ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత నాది, రాష్ట్రంలో ఇంటి అడ్రస్‌ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదు. సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చాం. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతాం అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.   నవరత్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా అన‌కాప‌ల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. అనంత‌రం  ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో అక్క‌చెల్లెమ్మ‌ల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. 

``దేవుడి దయతో ఈ రోజు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కొక్కరికి సెంట్‌ స్థలం ఇస్తున్నాం. ఇక్కడ గజం స్థలం రూ.12 వేలు ఉంద‌ని చెప్పారు. అంటే స్థలం విలువ అక్షరాల రూ. 6 లక్షలు. ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది.  స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి అక్షరాల పదిలక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఒక అన్నగా, తమ్ముడిగా అక్కాచెల్లెమ్మల తరపున భరించే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు

16 నెలల క్రితమే ఈ కార్యక్రమం జరగాల్సింది. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు.  మన పాలనకు, నాకు ఎక్కడ మంచి పేరు దక్కుతుందోనేమోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పటికి కల సాకారమైంది. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి సుమారు 489 రోజులు పట్టింది. ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చాం. దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. 

1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. అందరికీ ఇల్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే 30 లక్షల 70 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ల పట్టాలు, ఇళ్ల‌ మంజూరు పత్రాలు అందిస్తున్నాం.  రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి. రెండో దశ నిర్మాణం  ప్రారంభించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇల్లు రాని వారు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 55 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంటి స్థలాల విలువ రూ. 35 కోట్లు ఉంటుంది. కనీస సౌకర్యాల కల్పనకు మరో రూ. 32 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇవాళ ఇళ్ల పట్టాలు అందుకున్న మహిళల చేతుల్లో రూ.10 వేల కోట్ల ఆస్తి ఉంది. మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కొంద‌రు అడ్డంకులు సృష్టించారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదు. ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మ‌నం నిర్మించే కాల‌నీల్లో సచివాలయం, మార్కెట్‌ యార్డ్‌, మూడు పార్క్‌లు రాబోతున్నాయి. పాదయాత్రలో, ఎన్నికల ప్రణాళికలో 25 లక్షల మందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చాం. కానీ, అదనంగా, మెరుగైన సౌకర్యాలతోనే ఇళ్లులు కట్టిస్తున్నామ‌ని సగర్వంగా తెలియజేస్తున్నా.

పేదలకు సొంతిల్లు కల్పించడంలో కులం, మతం, ప్రాంతం చూడలేదు. అయితే రాష్ట్రాని ఎక్కడి నుంచీ సహాయం రాకూడదని కొందరు కుయుక్తులు చేస్తున్నారు. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళలకు మంచి చేయడంలో రాజీ పడను.  కోర్టుకు వెళ్లి పట్టాలు రాకుండా 489 రోజులు దుష్టచతుష్టయం అడ్డుకుంది. పేద‌ల‌కు మంచి చేస్తుంటే మ‌న ప్ర‌భుత్వంపై కడపు మంటతో రోజూ బురద చల్లుతున్నారు. పేదలకు మంచి జరిగితే దుష్టచతుష్టయంకు కడుపు మంట``.  

తాజా వీడియోలు

Back to Top