వైయస్‌ఆర్‌సీపీ పాలనలో అందరూ సమానమే

టీడీపీ నేతలు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?

టీడీపీ నేతల దౌర్జన్యాలపై ప్రశ్నించకూడదా?

తప్పు చేసిన వారిపై కేసులు పెట్టకూడదా?

అధికారులను బెదిరించే ధోరణిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు

మొన్న ఇసుక, నిన్న దాడులు..ఇవాళ ఆంగ్లం ప్రభుత్వంపై బురద చల్లేందుకు బాబు కుట్రలు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పోలీసులను సైతం బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై దాడి చేసి, పోలీసులను భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు..ఈ రోజు గతంలో తాను చేసిన తప్పులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాన్ని తప్పు అంటున్నారని ధ్వజమెత్తారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తే పోలీసులు చూసి చూడనట్లు ఉండాలా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి చట్టంలో అందరూ సమానమే అన్నారు. చంద్రబాబు తీరును గమనిస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనికి వస్తారా అని నిలదీశారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదన్నారు.ఆయన్ను అధికారంలో ఏమాత్రం పనికిరారని ప్రజలు తీర్పు ఇస్తే..ఇప్పుడు కరకట్టపై కూర్చొని ప్రజలు తననే కోరుకుంటున్నారని డేరా బాబ, కరకట్ట బాబా మాదిరిగా మాట్లాడుతున్నారన్నారు. ఆ రోజు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్‌పై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌పై 18 కేసులు నమోదు అయ్యాయని, రౌడీ షీట్ ఓపెన్‌ చేశారని, అలాంటి నేతను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. దెందలూరు బాబకు కరకట్ట బాబ మద్దతివ్వడం బాధాకరమన్నారు. మా పార్టీలోకాని, వేరే పార్టీలో కాని ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్నారు.  చంద్రబాబు తప్పులు చేస్తూ, హత్యా రాజకీయాలను ప్రోత్సహించారన్నారు. తప్పు చేసిన చింతమనేనిని దండించాల్సింది పోయి ..నీవు ఇంద్రుడివి, చంద్రుడివి అంటూ యనమల రామకృష్ణుడు పొగడటం ఏంటన్నారు. ఇలాంటి వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, స్పీకర్‌గా ఉన్న సమయంలో ఎన్‌టీఆర్‌కు ఎలాంటి మోసం చేశారో చూశామన్నారు. 
కుటుంబ సభ్యులను హత్య చేస్తే కూడా వారికి క్షమాభిక్ష చేసిన గొప్ప కుటుంబం వైయస్‌ఆర్‌ది అన్నారు. అలాంటి కుటుంబంపై ఫ్యాక్షన్‌ ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. ప్రతి ఎలక్షన్‌లో వైయస్‌ఆర్‌ కుటుంబానికి వేల మెజారిటీ ఇస్తూ ఆదరిస్తుంటే..ఆ ప్రజల తీర్పును సహించలేక చంద్రబాబు దూషిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లా , రాయలసీమ ప్రజలను తిట్టడం సరికానద్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అసెంబ్లీలో వారితో తిట్టించి శునకానందం పొందారన్నారు. మీ పార్టీని డ్రామా పార్టీ అంటున్నారని మీ వద్ద పని చేసిన వారే పేర్కొంటున్నారన్నారు. మా పార్టీలోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాలని మా నాయకుడు వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారన్నారు. 
లోకేష్‌ ఎప్పుడు అప్‌డెట్‌ కావడం లేదన్నారు. టీడీపీ పరిస్థితి చూసి ఎంపీలు, ఎమ్మెల్యేలు చంద్రబాబును తిడుతున్నారన్నారు. మొన్నటి వరకు ఇసుక అన్నాడు. ఆ తరువాత దాడులు అన్నారు. ఇప్పుడేమో ఆంగ్లమని కొత్త పల్లవి ఎత్తుకున్నారన్నారు. భాషాభివృద్ధికి కృషిన వారి పిల్లలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారని గుర్తు చేశారు. 
స్వాతంత్ర్య భారత దేశంలో ఏ ప్రభుత్వం కూడా వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలాగా పని చేసి ఉండదన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అవినీతి రహితంగా, లంచాలు లేకుండా, సిఫార్సులు అసలే లేకుండా చేశామన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు పెద్ద పీట వేశామన్నారు. పేదవారు ఉచితంగా చదువుకునేలా వీలు కల్పించామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. నిరుద్యోగులకు సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ వాలంటీర్లను నియమించామని చెప్పారు. మద్యం పాలసీ తెచ్చి పేదలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. ఆటో కార్మికులు, చేనేతలు, నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు ఇస్తున్నామని వివరించారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. వీటిపై తోక మీడియా చర్చించదన్నారు.  ఇవాళ ఎంతో మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారంత క్రిష్టియన్లా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుసంస్కారంతో పని చేస్తున్నారని విమర్శించారు. పేదవాడి కోసం సంక్షేమ పథకాలు సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెడుతున్నారని చెప్పారు. మాకు మాతృభాషాపై ఉన్న ప్రేమ మరెవరికీ లేదన్నారు. మతాలను, కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో బీజేపీతో కలిసి పని చేసిన చంద్రబాబుకు ఇవన్నీ గుర్తుకు రాలేదన్నారు. ఎన్నికల ముందు మోదీపై విమర్శలు చేసి, కాంగ్రెస్‌తో కలిసి తిరిగిన చంద్రబాబు..ఈ రోజు ఓడిపోయిన వెంటనే మళ్లీ మోదీ కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు, ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ఇప్పుడు వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని హెచ్చరించారు.

 

Read Also: టిడ్కో హౌసింగ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

Back to Top