చంద్రబాబుకు పేదల పట్ల చిత్తశుద్ధి లేదు

ప్రతిపక్షం ప్రవర్తన ప్రజలంతా చూశారు..

పేదల బిల్లులను అడ్డుకోవడం దారుణం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

అమరావతిఃఎస్సీ,ఎస్టీ,బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అసెంబ్లీ సాక్షిగా పస్ఫుటమయిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏ రాజకీయ నాయకుడు చేయనివిధంగా సంస్కరణలు చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారన్నారు.చంద్రబాబు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ఏపీ ప్రజలంతా  చూస్తున్నారన్నారు.సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు,ప్రవేశపెట్టిన బిల్లులు ఒక కలికితురాయిగా పేర్కొన్నారు.దేశ చరిత్రలో అణగారిన కులాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు.రాబోయే రోజుల్లో ఏపీలో పేదలకు మేలు క‌లిగించ‌డానికి  బాటలు వేసే బిల్లులుగా భావిస్తున్నామన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top