చంద్ర‌బాబువి దిగ‌జారుడు రాజ‌కీయాలు

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై  ప్ర‌భుత్వం,పోలీసుల తీరుపై అనుమానాలు

క‌ట్టుక‌థ‌ల‌తో వాస్త‌వాల‌ను క‌ప్పిపుచ్చుతున్నారు

కుట్ర రాజ‌కీయాలు ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ

హైద‌రాబాద్‌: వైయస్‌ వివేకానంద రెడ్డి  హత్యపై ప్రభుత్వం,పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు  చంద్రబాబు వాడుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మరణవార్త తెలిసిన వెంటనే మూడు సార్లు పోలీసులకు ఫోన్ చేశాన‌ని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంతకుముందే చెప్పార‌న్నారు. అర గంట పాటు సాక్ష్యాత్తు ఎంపీ చిన్నాన్న మృతిపై మూడు సార్లు ఫోన్ చేస్తే సంఘటన స్దలంకు రావడానికి పోలీసులు అరగంట సమయం తీసుకున్నారంటే ప్రభుత్వ పెద్దలు స్దానిక పోలీసు అధికారులుతో ఏం మంతనాలు చేశార‌ని ప్రశ్నించారు. పోలీసులు అక్కడ లేనట్లు ఉదయమే చేరుకోనట్లు కట్టు క‌థ‌లు అలుతున్నార‌న్నారు. వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు రాజకీయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

 ముఖ్యమంత్రి స్దాయినుంచి కిందిస్దాయివరకు ఒకటే కట్టుకథ అల్లుతున్నార‌న్నారు. మొదట ఇది అనుమానస్పద మృతి అని,  తెలిసినప్పటినుంచి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసి సిఎం స్దాయిలో ప్రజలను మభ్యపుచ్చుతుంటే ఏ పోలీసు అధికారి మాట్లాడటం లేద‌ని, ఎందుకు హైడ్రామా నడుపుతున్నార‌ని ప్ర‌శ్నించారు.  పోలీసులు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేద‌ని ప్ర‌శ్నించారు. వైయ‌స్ వివేకానందరెడ్డి కుమార్తె  బాధ‌తో మీడియాతో  మాట్లాడితే దానిని సైతం రాజకీయం చేస్తున్నార‌న్నారు. నిష్పాక్షిక దర్యాప్తు చేయాల‌ని , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయొద్ద‌ని మాట్లాడ‌ర‌న్నారు. చంద్రబాబు కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. చనిపోయింది సాధార‌ణ  వ్యక్తి కాద‌ని, మాజీ మంత్రి,ఎంపి, ఎమ్మెల్యేగా ప‌నిచేశార‌ని తెలిపారు. చంద్రబాబు కట్టుక‌థ‌లు అల్లుతున్నాడు తప్పితే నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని ఎందుకు చెప్పడం లేద‌ని ప్ర‌శ్నించారు. చేతిలో ప్రభుత్వాన్ని పెట్టుకుని సిబిఐ విచారణకు ఆదేశించలేని స్దితిలో ఉన్నార‌న్నారు. చంద్ర‌బాబు పిరికిపందలాగా మాట్లాడుతున్నార‌ని,  సిట్‌ను  గుప్పిట్లో పెట్టుకుని అది ఎలా పనిచేయాలో చెబుతూ.. జగన్ మోహన్ రెడ్డిని ఇరికించే  కుట్రల‌కు పాల్పడుతున్నార‌ని విమ‌ర్శించారు.

వివేకానంద దర్యాప్తుపై ఎందుకు యాగి చేస్తుర‌ని, ఎందుకు సిబిఐ అంటే భయపడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. చివరకు మేం న్యాయం కోసం కోర్టులు ఆశ్రయించాల్సిన పరిస్థితి  కల్పించార‌న్నారు. హత్యను చూసి లోకేష్ పొరపాటుగా అన్నారో, గ్రహపాటుగా అన్నారో పరవశించిపోతున్నాం అనే మాటను  చంద్రబాబు నిజం చేస్తున్నార‌న్నారు. ఓ హత్య జరిగితే దానిని రాజకీయంగా వాడుకుంటున్న నీచమైన నైజం చంద్ర‌బాబుది అని ధ్వ‌జ‌మెత్తారు. సిఐ,కానిస్టేబుల్ లాంటి వ్యక్తులు ఎలా పనిచేయాలో కూడా మీరే చెబుతుంటే వారు నిష్పాక్షికంగా పనిచేస్తారా అని మండిప‌డ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి  అనుమానస్పద స్దితి అని కంప్లయింట్ ఇచ్చారని.. విషయాన్ని తొక్కిపెట్టి అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ రాజారెడ్డి  హత్య కేసులో హంతకుడ్ని నేనే విడిపించాననే ఏ ధైర్యంతో టిిడిపి వాళ్లు చెబుతార‌ని ప్ర‌శ్నించారు. వాస్తవాలు తొక్కిపట్టి దుష్ప్రచారం  చేయ‌డం నీచరాజకీయం కాదా అని ప్ర‌శ్నించారు.

 గోరంట్ల మాధవ్ నామినేషన్ వేయకుండా ఆయన రాజీనామాను ఆమోదించకుండా ఏ స్దాయిలో వైయస్సార్ కాంగ్రెస్  పార్టీ అంటే చంద్రబాబు భయపడుతున్నారో అర్దం చేసుకోవాలన్నారు. బిసి నేతలు ఎవరూ రాజకీయాలలోకి రాకూడదా అని ప్ర‌శ్నించారు. అనంతపురం లో మీరు చేసిన అరాచకాలు బయటకువస్తాయని భయమా అని ప్ర‌శ్నించారు. మీ కుట్రరాజకీయాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయ‌న్నారు. టిడిపి అభ్యర్దులు గెలవడానికి జనసేన ఎందుకు వీక్ అభ్యర్దులను పెడుతోంద‌ని ప్ర‌శ్నించారు. చంద్రబాబు ముగ్గురు కూటమిలో కాంగ్రెస్, జనసేన,బిఎస్పి, వామపక్షాలు, పాల్ లాంటి ఊరుపేరు లేని పార్టీ ఉంద‌న్నారు. నేరుగా పోటీ చేసే సత్తా లేక నేరుగా పొత్తులు పెట్టుకునే సత్తా లేకుండా ఉన్నార‌న్నారు.
 

Back to Top