తిరుపతి: ఎన్నికల హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓట్లు వేయించుకొని మోసం చేశారని, ఈ మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దామని వైయస్ఆర్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, పార్టీ సమన్వయకర్తలు అభినయ్ రెడ్డి, విజయానంద రెడ్డి, సునీల్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కృపాలక్ష్మి ప్రారంభించారు. అనంతరం 'చంద్రబాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ..`చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల విషయంలో మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని పార్టీ అధినేత వైయస్ జగన్ రూపొందించారు. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. కూటమి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు, 143 హామీలలో ఏది నెరవేర్చలేదు. బాండ్లపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు సంతాకాలు చేసి మరి ఇచ్చారు. కూటమీ నిఫేస్టోలో వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మాస్తామని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నారంటే..` ప్రతిజిల్లాలో సమన్వయ కమిటి సమావేశాలు నిర్వహిస్తాం. వైయస్ జగన్ సూచన మేరకు రీకాలింగ్ చంద్రబాబు మెనిఫేస్టో ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఓటిపి లు ఇచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాల తో బాండ్లు కూడా ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలన్ని నెరవేర్చామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎంత.. ఎంత ఇచ్చారు అనేది తెలుస్తుంది` అని పెద్దిరెడ్డి తెలిపారు.