కూటమి పాలనలో స్కూళ్లకు విద్యార్ధులు దూరం

దుప్పట్లు ఇవ్వలేక హాస్టళ్ల నుంచీ తరిమేస్తున్నారు

జగన్ పాలనలో తెచ్చిన పథకాల జాడ ఏదీ ?

ఏది విధ్వంసమో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ డిమాండ్ 

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు

పిల్లల మార్కులపైనే లోకేష్ భవిష్యత్తు

విద్యార్ధుల్ని బతిమాలుకుంటున్నారు

జగన్ తెచ్చిన పథకాలన్నీ నిర్వీర్యం చేశారు 

విద్యావ్యవస్థను పూర్తిగా దిగజార్చారు

జూపూడి ప్రభాకర్ ఫైర్ 

స్కూళ్లలో జగన్ తెచ్చిన ఇంగ్లీష్ మీడియం ఏమైంది ?

డిజిటల్ క్లాస్ రూముల్ని సైతం లేకుండా చేశారు

అవస్థలు తట్టుకోలేక ప్రైవేటు స్కూళ్లకు విద్యార్ధులు

హాస్టల్ విద్యార్ధులకు దుప్పట్లూ ఇవ్వలేని మంత్రిగారు

జూపూడి ప్రభాకర్ ధ్వజం 

నాడూ-నేడుకు జగన్ పెట్టిన ఖర్చు రూ.8524 కోట్లు

రెండేళ్లలో కూటమి విదిల్చింది రూ.544 కోట్లు

ప్రభుత్వ పాఠశాలలు పట్టని కూటమి సర్కార్

విద్యాపథకాలు, కిట్లూ, పుస్తకాలు ఇవ్వలేని దుస్దితి

జూపూడి ప్రభాకర్ మండిపాటు

తాడేపల్లి: కూటమి సర్కార్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే పనిగా పెట్టుకుందని, ఇప్పటికే విద్యార్ధులకు పథకాలు, కిట్లూ, పుస్తకాలు ఇవ్వకుండా ప్రైవేటు పాఠశాలలకు తరిమేస్తున్నారని, ఇప్పుడు హాస్టళ్లలో కనీస వసతులు ఇవ్వకుండా అర్ధరాత్రి తరిమేసే దుస్దితి వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖల్ని మార్చి, వేల కోట్ల పథకాల్ని అమలు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్ని నిలబెట్టుకోకపోగా.. గత ప్రభుత్వం అమలు చేసిన ఇంగ్లీష్ మీడియంతో పాటు సంక్షేమ పథకాల్నీ పక్కనబెట్టేసిందని జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. 
ప్రెస్ మీట్లో జూపూడి ప్రభాకర్ రావు ఇంకేమన్నారంటే..

కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకపోగా.. ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేస్తోంది.  రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుందా లేక ఓ లిమిటెడ్ కంపెనీగా జరుగుతుందా అర్దం కావట్లేదు. కూటమిలో మూడు భాగస్వామ్య ఉంటే అందులో ఒక పార్టీ నాయకుడు అస్సలు మాట్లాడడు. గతంలో ఆయనకు ఎన్నికలకు ముందు మాట్లాడేందుకు పేమెంట్ చేసేవారంట, ఇప్పుడు మాట్లాడకుండా ఉండేందుకు పేమెంట్ చేస్తున్నారంట. అంటే ఇదో కుటుంబ కంపెనీగా మారిపోయింది. దీన్ని కూటమి అని పిలిచే పరిస్దితి లేదు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీఅధికారంలో ఉన్నప్పుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు అమలు చేసిన ఎన్నో అంశాల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేకపోతోంది ? విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్.. పిల్లలూ మీరు మార్కులు తెచ్చుకుంటేనే మా నాన్న దగ్గర మార్కులు పడతాయని చెప్పుకుంటున్నారు. మీకు అన్నీ ఇచ్చేస్తున్నాం అంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు గతంలో విద్యావ్యవస్ధలో తీసుకొచ్చిన విధానాలు ఎక్కడికి పోయాయి? అవన్నీ లేకపోతే వాటి విధ్వంసం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం. అప్పట్లో ప్రభుత్వ స్కూళ్లను నాడు-నేడుతో అభివృద్ధి చేశాక, వాటికి పిల్లల్ని తీసుకుని తల్లితండ్రులు పరుగులు తీసేవారు. ఆ స్థితి నుంచి ఇప్పుడు మీరు చదివితేనే నాకు మార్కులు పడతాయంటున్నారు. 
ఆటోమేటిగ్గా కొన్ని స్కూళ్లల్లో ఫలితాలు వచ్చాక మీరు గెలిచారు, నన్ను గెలిపించారంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ఇదేమీ క్రికెట్ కాదనే విషయం లోకేష్ గుర్తుంచుకోవాలి. నిన్న కాక మొన్న చింతలపూడి నియోజకవర్గంలో 8వ తరగతి చదువుతున్న బాలిక చలిగా ఉంది, దుప్పటి కావాలని అడిగితే అర్ధరాత్రి హాస్టల్ నుంచి పంపేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పిల్లలకు రాత్రి చలికి కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. అలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వం ఉంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు విద్యావ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తే.. కూటమి సర్కార్ మాత్రం దాన్ని పూర్తిగా దిగజార్చింది. 

రెండేళ్లుగా కూటమి నాయకులు పాఠశాల వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తెలుగును చంపేస్తున్నారంటూ ఉద్యమాలు చేసిన వారు, వెంకయ్యనాయుడు వంటి వాళ్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు మీడియం లేదు, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు తెచ్చిన ఇంగ్లీష్ మీడియా కూడా లేదు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు తెచ్చిన డిజిటల్ క్లాస్ రూమ్ లో ఇప్పుడు ఎందుకు లేవో లోకేష్ సమాధానం చెప్పాలి. అలాగే విద్యార్ధులకు గతంలో ఇచ్చిన ట్యాబ్ లు ఎక్కడికెళ్లాయి? వాటిని అమ్మేసుకున్నారా ? వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ కొనసాగిస్తూ ఇంకా కొత్తగా అన్నీ ఇస్తామన్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? పాఠశాలల్లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి హయాంలో 13 ఐటమ్స్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు అవన్నీ లేక విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలలకు తరలిపోతున్నారు. మీ నారాయణ,  చైతన్య, భాష్యం విద్యాసంస్థలకు తరిమేశారా? రాష్ట్రంలో ఏ స్కూలు చేసినా టీచర్లు లేరు, విద్యా బోధన లేదు, హాస్టళ్లూ లేవు. హాస్టళ్లకు మీరు పెట్టిన మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి తన సాంఘిక సంక్షేమ శాఖ గురించి మాట్లాడరు. ఆయనకు మంత్రిగా టాప్ ర్యాంక్ ఎలా ఇచ్చారో మరి. దుప్పట్లు కూడా ఇవ్వలేని మంత్రిగా టాప్ ర్యాంక్ ఇచ్చారంటే మీ ప్రభుత్వ పనితీరు అలా ఉంది. రాష్ట్రంలో హస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్ధులకు పరీక్ష ఫీజు కట్టలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం.. మేం ప్రశ్నిస్తే ఆ జీవో వెనక్కి తీసుకున్నారు. లోకేష్ గొప్పగా పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన గతంలో స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, పథకాలూ ఏవీ కొనసాగించలేకపోతున్నారు. 

నాడు-నేడుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ప్రభుత్వం  రెండు దశల్లో రూ.8524 కోట్లు ఖర్చుపెట్టారు. మూడో దశ వచ్చే సరికి ఎన్నికలు వచ్చాయి. కానీ వాటిని ఇప్పుడు కొనసాగించకుండా పక్కనబెట్టేశారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కేవలం రూ.544 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. అంటే ఎంత తేడా ఉందో అర్దమవుతోంది. పేదలు, గ్రామీణ విద్యార్ధులు చదువుకుంటున్న పాఠశాలలు మాకు అవసరం లేదని ఈ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేనట్లు తెలుస్తోంది. ఇప్పుడు సీబీఎస్ఈ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ సైతం ఎత్తేస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు ఆపేశారు ? విద్యాదీవెన, వసతి దీవెన నిధుల బకాయిలు ఇవ్వకుండా పూర్తిగా పక్కనబెట్టేశారు. ఈ రెండేళ్లలో సంక్షేమ హాస్టళ్లలో 29 మంది పిల్లలు చనిపోయారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు హాస్టల్ పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకున్నారు. తన పిల్లలు ఇంగ్లండ్ లో చదువుతుంటే, ఇక్కడి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిభావించారు. కానీ చంద్రబాబు మాత్రం తన కుమారుడు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివితే చాలు. మిగతా వాళ్లకు ఇంగ్లీష్ అవసరం లేదని అనుకుంటున్నారు. స్కూల్లు తెరిచి నెలరోజులైనా విద్యార్ధులకు యూనిఫాం, బెల్ట్, టైలు, పుస్తకాలు కూడా ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో చదువు ఉన్నట్లా, అమ్మేసినట్లా అర్దం కావట్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు విద్యపై పెడుతున్న ఖర్చును భవిష్యత్ పెట్టుబడిగా మాత్రమే  భావించారు. కానీ ఇప్పుడు కూటమి మాత్రం దాన్ని ఖర్చుగా చూస్తోంది. అందుకే నిధులు ఇవ్వడం లేదు. జగన్ స్కూళ్లలో పెట్టిన టేబుల్స్ కు స్టిక్కర్లు వేసుకోవడం కాదు, రేపు ప్రజలు మీ నోటికి స్టిక్కర్లు వేస్తారు జాగ్రత్త. ప్రజలకు, విద్యార్ధులకు సమాధానం చెప్పాల్సిన రోజుకు ముందున్నాయి. 87 లక్షల 41 వేల 888 మంది పిల్లలకు ఇవ్వాల్సిన పథకాల్ని అందులో 20 లక్షల మందికి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. వీటిపై వైయ‌స్ఆర్‌సీపీ దీన్ని కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. వైయ‌స్ఆర్‌సీపీ నోరు మూస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. వాళ్ల నోరు మూయిస్తే విద్యార్ధులు ప్రశిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు.

Back to Top