5వ తేదీ నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకే షాపులు

అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు 
 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు. ఈ సమయంలో ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తారు. అయితే అన్ని రకాల అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top