రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించారు.  పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే  నర్సాపురం  ఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ  దినోత్సవ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కృష్ణాజిల్లా
ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పామర్రు వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు.  

చిత్తూరు
  వైయస్ఆర్‌సీపీ పార్లమెంటు కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి చేసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కేక్ కట్  చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌తోపాటు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. 

అనంతపురం 
 వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.   ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,  అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీంఅహ్మద్.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కర్నూలు
కర్నూలు నగరంలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బీవై రామయ్యలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర  అవతరణ వేడుకలు నిర్వహించారు. 
 

Read Also: రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న సీఎం వైయస్‌ జగన్‌కు  ధన్యవాదాలు 

తాజా ఫోటోలు

Back to Top