రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న సీఎం వైయస్‌ జగన్‌కు  ధన్యవాదాలు 

పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఘనంగా ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  జాతీయ జెండా ఆవిష్కరణ
 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తదితరులు పొట్టి శ్రీరాములు చిట్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తున్నామని చెప్పారు. ఐదేళ్లు చంద్రబాబు రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేకుండా చేశారని మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షల పోరాటం పేరుతో చంద్రబాబు కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న సీఎం వైయస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. 
 

Read Also: రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధి సాధించాలి

Back to Top