ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు 

ఆంధ్రా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు

గవర్నర్‌ బిశ్వభూషన్‌, సీఎం వైయస్‌ జగన్‌ హాజరు

అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.  శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషన్‌, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వేడుకలు నిర్వహించారు.  వేడుకల్లో భాగంగా  హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రా  ఆహార పదార్థాల స్టాల్స్‌ నోరూరించాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సత్కరించారు. 

Read Also: పిటీషన్‌ తిరస్కరిస్తే ఎందుకంత రాద్ధాంతం

Back to Top