ఏపీ ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు

మగ్గం నేసే చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు 

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు

న్యాయవాదులకు రూ.5 వేలు ప్రోత్సాహకం

 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్రత్యేక కార్పొరేషన్‌

జిల్లాల వారీగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

ఏపీఎస్‌ ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు

కేబినెట్‌ వివరాలను వెల్లడించిన మంత్రి పేర్నినాని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి వరాల జల్లు కురిపించారు. ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చుతూ ఇవాళ జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ మీటింగ్‌ వివరాలను పేర్ని నాని మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ..

ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీ ద్వారా ఏపీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ..ఏ కుటుంబం అయితే మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారో..ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కేబినెట్‌లో వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం అనే పథకాన్ని రూపొందిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ మాసం లోపు జాబితా అంతా కూడా గ్రామ సభల్లో అందుబాటులో ఉంచుతాం. ఆ జాబితాలో తప్పులు ఉంటే సరిచేస్తాం. డిసెంబర్‌ 21వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఎంత మంది లబ్ధిదారులు ఉన్నా కూడా చేనేత వృత్తిగా బతుకుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తాం. 

ప్రాణాన్ని ప్రణంగా పెట్టి సముద్రం నడిమధ్యలో వేట చేస్తున్న మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో మత్స్యకారుల బాధలు విన్న సమయంలో వారికి హామీ ఇచ్చారు. వేట నిషేధ కాలంలో రూ.10 వేలు ఆర్థికసాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మేకనైజ్‌డ్‌ బోట్లు, మోటార్లు లేని కుటుంబాలే కాకుండా తెప్పలపై సముద్రంలో వేటకు వెళ్తున్న కుటుంబాలను కూడా ఈ పథకంలోకి తీసుకువస్తూ మంత్రివర్గం ఆమోదించింది. ఎన్నికల ముందు చెప్పిన మాటను నవంబర్‌ 21న అంతర్జాతీయ మత్స్య దినోత్సవం రోజున ఈ పథకాన్ని అమలు చేస్తాం. మత్స్యకారులు వేటాడే బోట్లకు వాడే డీజిల్‌ మీద లీటర్‌పై రూ.9 సబ్సిడీ ఉండగా దానికి 50 శాతం పెంచి అదనంగా  ఇస్తాం. నిర్దేశిత డీజిల్‌ పంపులను ఫిషింగ్‌ హార్బర్ల వద్ద ఏర్పాటు చేసి అయిల్‌ కొట్టిన వెంటనే సబ్సిడీ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా నవంబర్‌ 21 నుంచి అమలులోకి తీసుకువస్తాం. అయిల్‌ సబ్సిడీ సుమారు రూ.100 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నాం. 
ముమ్మిడివరం నియోజకవర్గంలోని గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ చేపట్టిన అయిల్‌ అన్వేషణలో ఉపాధి కోల్పొయిన 16500 మంది మత్స్యకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు నవంబర్‌ 21న చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. 

Read Also: రైతులను మోసం చేసిన ఘతన చంద్రబాబుదే

ఏపీలోని 13 జిల్లాల్లో అందరికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్‌ గ్రీడ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి కూడా మనిషికి 105, 110 లీటర్లు ప్రతి రోజు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఏపీ డ్రికింగ్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌కు నిధులు సమకూర్చుకునేందుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. సుమారుగా రూ.4.90 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనం రూ.1000 నుంచి రూ.3 వేలు పెంచి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దీని వల్ల 52296 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం రూ.211.91 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం తీర్మానం చేసింది. 
హోం గార్డులకు  ఇచ్చే డైలీ అలవెన్స్‌ రూ.710కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం ఏ ఏజెన్సీకి ఇచ్చినా కూడా వసూళ్ల పర్వం కొనసాగింది. ఉద్యోగానికి ఇంత చొప్పున ఏజెన్సీలు కొల్లగొట్టాయి. ఇవన్నీ మనం చూశాం. అలాంటి దోపిడీ, అవినీతి కార్యక్రమాలు కొనసాగించకుండా, ప్రతి రూపాయి కూడా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అందేలా నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సరాసరి ఈ కార్పొరేషన్‌ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌లో పని చేసే వేతన కార్మికులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నాం.  

పలాసలో సుమారు రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రి, రిసెర్స్ సెంటర్‌లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ పోస్టుల మంజూరుకు అనుమతించాం.
డిసెంబర్‌ 11న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు ప్రోత్సాహకం రూ.5 వేలు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. లా చదువుకొని బార్‌ అసోసియేషన్‌లో ఉన్న ప్రతి న్యాయవాదికి మూడేళ్ల పాటు ప్రోత్సాహకాన్ని అందిస్తాం. 

ప్రతినియోకవర్గానికి ఒకటి, ప్రతి పార్లమెంట్‌లో ఒక రిజర్వ్‌ ఉంచుకునేందుకు బోర్లు వేసే డ్రిల్లింగ్‌ మిషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. డబ్బున్న వారికి, రాజకీయ పార్టీలో పలుకుబడి ఉన్న వారికే గతంలో వాహనాలు అందించేవారు. ఎస్సీ కార్పొరేషన్‌లో సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలే తీసుకున్నారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో జరుగవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతను గుర్తించి, రాష్ట్రంలోని రవాణాకు సంబంధించిన ప్రతి వాహనాన్ని లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వమే వాహనాలు ఇప్పించి నిరుద్యోగ యువతకు రూ.20 వేలు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ఐదేళ్లు పూర్తి అయ్యేలోగా అప్పు తీరి ఆ వాహనం మిగిలిపోయేలా ప్రణాళిక రూపొందించాం. పారదర్శకంగా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని ఆమోదించాం. 
ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 3500 బస్సులు కాలం చెల్లాయి. ఆ బస్సులన్నీ కూడా తొలగించి కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. చిరుధాన్యాలు, ఆపరాల బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు బోర్డు కృషి చేస్తుంది. పంటల ప్రణాళిక, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై దృష్టి సారిస్తాం. నీటి వసతి లేని భూములను గుర్తించి సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గడిచిన ప్రభుత్వంలో పౌరసరఫరాల పేరుతో వారికి ఉన్న క్యాష్‌ క్రెడిట్‌ నిల్వలు రూ.20 వేల కోట్లు ఉన్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఆ డబ్బును డ్రా చేసి పసుపు-కుంకుమకు మళ్లించారు. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయాలంటే డబ్బులు లేకుండా చేశారు. సివిల్‌ సఫ్లై కార్పొరేషన్‌ను చంద్రబాబు దివాల పట్టించారు. ఈ నిధులు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

పీపీఏల సంక్షోభం ద్వారా అవసరాల కంటే ఉన్న కరెంటును మూత వేసి, ఎక్కువ రేటుకు కరెంటు కొనుగోలు చేసి గత పాలకులు వ్యాపారం చేశారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కరెంటు డిస్కమ్‌లను ఆదుకునేందుకు రూ.4741 కోట్ల బాండ్లను విడుదల చేయాలని, ఇందుకోసం ఏపీ పవర్‌ ప్రాజెక్టులకు అనుమతిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర విపత్తుల సహాయ కార్యక్రమాలకు ఉపయోగపడే సంస్థకు 39.23 ఎకరాల భూమిని కేటాయించాలని తీర్మానం చేశాం. రైల్వే డిపార్టుమెంట్‌కు కూడా భూమి, రేణిగుంట విమానాశ్రయానికి భూమి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. విశాఖలోని పరదేశ్‌ పాలెంలో ఆమోద పబ్లికేషన్‌కు ఏ ఆమోదం లేకుండా చంద్రబాబు 1.50 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది హాస్యాస్పదమైన నిర్ణయం.  రిజిస్ట్రర్‌ విలువ రూ.7.50 కోట్లు అయితే  రూ.50.05 లక్షలకు కేటాయించారు. బయట మార్కెట్‌లో రూ.25 కోట్లు విలువ ఉంటుంది. ప్రచారం కోసం నిధులు పెంచుతూ ఆమోదం తెలిపామని పేర్ని నాని వివరించారు.

Read Also: రైతులను మోసం చేసిన ఘతన చంద్రబాబుదే

తాజా వీడియోలు

Back to Top