అమరావతి: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఆ వర్గాలను అక్కున చేర్చుకొన్న దేశంలో ఏకైక సీఎం వైయస్ జగన్. ఆ వర్గాలకు సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన చేయూతతో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఆవిష్కృతమైంది. వైఎస్ జగన్ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికా రం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైయస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్స యాత్ర రెండో దశ బుధవారం ప్రారంభమవుతోంది. ఈ నెల 30 వరకు ఈ యాత్ర జరుగుతుంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది. రెండో దశలో 39 నియోజకవర్గాల్లో యాత్ర వైయస్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర తొలి దశలో 35 నియోజకవర్గాల్లో జరిగింది. రెండో దశలో 39 నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొంటారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ వర్గాల ఆర్ధిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను, చేసిన మంచిని ఈ యాత్రల్లో నేతలు వివరిస్తున్నారు. అక్టోబర్ 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్ర మొదటి దశ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్.. సీఎం వైయస్ జగన్ పాలనలో ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఈ నాలుగున్నరేళ్లలో రూ. 2.35 (డీబీటీ) లక్షల కోట్లు సంక్షేమ పధకాల రూపంలో నేరుగా లబి్ధదారులకు అందాయి. రూ. 2.34 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో అందాయి. మొత్తంగా రూ.4.69 లక్షల కోట్లను వివిధ రూపాల్లో పేదల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం సీఎం జగన్ అందించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతకు ముందు, ఇప్పుడూ ఇంత పకడ్బందీగా, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ప్రజలకు అందలేదు. దీంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి ప్రామాణికంగా నిలిచే జీఎస్డీపీ వద్ధి రేటులోనూ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది.