తాడేపల్లి: అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు కొనసాగిస్తాం, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుసాగుతామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఏమన్నారంటే... భారతదేశ చరిత్రలో అందరూ గర్వంగా, గౌరవంగా చెప్పుకునే నాయకత్వ లక్షణాలు కల్గిన వ్యక్తిగా, ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలని, నాడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, దేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు. తెలుగు మాట్లాడేవారంతా ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో ఉండాలని నిస్వార్ధంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలని ముందుకుసాగి, ఆమరణ నిరాహర దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు. ఆంధ్రులు ఆరంభ శూరులు కారని నిరూపించిన వారు ఆయన, పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్నాం నిస్వార్ధంగా తెలుగు జాతి కోసం ఆ మహానుభావుడు మరణించారు. సమాజంలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళే ప్రక్రియలో భాగంగా మా నాయకులు వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకుసాగుతాయి, శ్రీ పొట్టిశ్రీరాములు గారికి మేం ఘనమైన నివాళులర్పిస్తున్నాం. ఒక మహానాయకుడిగా పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను కొనసాగిస్తూ మేం ముందుకు సాగుతామని లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు.