జగన్ ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు  

మాజీ ఉప ముఖ్యమంత్రి, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా 

వైయ‌స్ఆర్ జిల్లా: క‌డప నగర అభివృద్ధికి అమృత్ 2.0 పథకం కింద సుమారు రూ.575 కోట్ల విలువైన పనులకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా తెలిపారు. అప్పట్లో ఎన్నికల కారణంగా పనులు ప్రారంభం కాలేదని, ప్రస్తుతం అదే ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి కొత్తగా తామే తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. కడప నగరంలోని తన నివాస కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండానే గత ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులకే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కడప నగరంలోని తన నివాస కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం కింద కడప నగర అభివృద్ధికి సుమారు రూ.575 కోట్ల విలువైన పనులకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్నికల కారణంగా అప్పట్లో పనులు ప్రారంభం కాలేదని, ఇప్పుడు అదే ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.

జగన్ ప్రభుత్వం రూపొందించి ఆమోదించిన ప్రాజెక్టులకే కొత్త జీవోలు జారీ చేసి క్రెడిట్ పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బ్రహ్మంసాగర్ నుంచి కడప నగరానికి రోజుకు 95 ఎంఎల్‌డీ తాగునీటిని అందించే ప్రాజెక్టు కూడా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సిద్ధమైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప నగర అభివృద్ధికి కొత్తగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఇప్పటికే మంజూరైన పనులకే శంకుస్థాపనలు చేస్తూ "క్రెడిట్ చోరీ"కి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రచారాన్ని పక్కనపెట్టి అమృత్ 2.0 పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాక సురేష్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 

Back to Top