డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నలు 

డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ మాజీ సీఎం ట్వీట్ 

తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్‌ మీడియా వేదికగా నిలదీశారు వైయ‌స్‌ జగన్‌. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..

65  మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?

ట్విస్ట్ 2:  ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారు

మరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?

ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!

మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?

ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు

2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.

ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..

అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?

డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?

ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?

ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్

77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లో

కానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.

మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?

ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్

ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.

2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..

మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:

ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?

ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా?

చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా?
 

https://x.com/ysjagan/status/2099084588211708191/video/1

Back to Top