గర్వంగా తలెత్తుకొని చెప్పుకుంటాం

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా

ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి 

విజయవాడ: మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను 40 రోజుల పాలనలోనే అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలే ఆలోచనలుగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకుసాగుతున్నారన్నారు. ఎవరినీ మోసం చేయని వ్యక్తి, మోసం అనే ఆలోచన రాని వ్యక్తి రైతు అని, ఆ రైతు ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట పండకపోతే.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక, తన కుటుంబాన్ని అనాథలను చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అలాంటి రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని, ఎక్కడకు వెళ్లినా తల ఎత్తుకొని మా నాయకుడి గురించి చెప్పుకుంటామన్నారు. 
రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిహారం ఇస్తే మరింత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని అవహేళన చేస్తూ మాట్లారని నాగిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ఇన్‌పుట్‌ సబ్సిడీలు, ఇన్సూరెన్స్‌లు లేవని, నకిలీ విత్తనాలతో ఎంతో మంది పంట నష్టపోయారన్నారు. అయినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చంద్రబాబు పాలనలో రైతులు అణగదొక్కపడ్డారన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకుసాగుతున్నారన్నారు. రైతుకు ఏ కష్టం వచ్చిన అగ్రికల్చర్‌ మిషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చని, దయచేసి అన్నదాత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రభుత్వానికి, అగ్రికల్చర్‌ మిషన్‌ దృష్టికి తీసుకురావాలని కోరారు.

 

Back to Top