పసుపు బిళ్లతో కార్యకర్తలకు టీడీపీ లైసెన్స్!

టీడీపీ కార్యకర్తలకు మంత్రి అచ్చెన్నాయుడు ఉపదేశం

అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్ప‌టికే దాడులు, దౌర్జ‌న్యాల‌తో పేట్రేగిపోతుండ‌గా, మ‌రో కొంత అంకానికి తెర లేపారు. మంత్రి అచ్చెన్నాయుడి ప్రోద్భ‌లంతో టీడీపీ శ్రేణులు దోపిడీకి సిద్ధమవుతున్నారు. ప‌సుపు బిళ్ల‌తో కార్య‌క‌ర్త‌ల‌కు దోపిడీ చేయాల‌ని లైసెన్స్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకి పసుపు బిళ్లతో వెళ్లి అధికారుల్ని బెదిరించి మీ పని చేయించుకోండని టీడీపీ కార్యకర్తలకు మంత్రి అచ్చెన్నాయుడు ఉపదేశం చేశారు. మాట వినని అధికారుల సంగతి నేను చూస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. నిన్న టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లండి, మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు, అలా చేయకపోతే ఏమవుతుందో ఉద్యోగస్తులకు తెలుసు..అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపుతున్నాయి. వీరి దోపిడీ, దౌర్జ‌న్యాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీటికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెబుతారో వేచి చూడాలి.

Back to Top