ఇదిగో ‘కియా’ అస‌లు క‌హాని !

కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు, పచ్చ మీడియా పచ్చి అబద్దాలు

గొల్ల‌ప‌ల్లికి నీరు రావ‌డానికి వైయ‌స్ఆర్ కార‌ణం

కియా రావ‌డానికి ప్ర‌ధాని మోదీ స‌హ‌కారం

అంతా త‌న క్రెడిటే అంటూ చంద్ర‌బాబు ఊక‌దంపుడు ఉప‌న్యాసం

అనంత‌పురం:  సాగునీటి ప్రాజెక్టులతోనే అనంతపురం జిల్లాకు ‘కియా’ ప్లాంటు వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు నిజాన్ని ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఆ సాగునీరు ఎలా వ‌చ్చిందో మాత్రం ఆయ‌న నోటితో చెప్ప‌రు.  ‘కియా మోటార్స్‌’లో మంగళవారం ప్రయోగాత్మక ఉత్పత్తి(ట్రయల్‌ ప్రొడక్షన్‌) కార్యక్రమం జ‌రిగింది.  భారత్‌లో కొరియా రాయబారి షిన్‌బాన్గి్కల్, కియా ప్రెసిడెంట్‌ హాన్‌వూ పార్క్, ఎండీ కూక్యున్‌ షిమ్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కియా’ను స్థాపించాలని కోరినప్పుడు.. ప్లాంటు స్థాపిస్తామని, కానీ ఇక్కడ నీళ్లు ఎక్కడ ఉన్నాయని ‘కియా’ ప్రతినిధులు అడిగారన్నారు. ఆర్నెల్ల సమయం కోరానని, గొల్లపల్లికి నీళ్లు తీసుకొచ్చానని, దీంతో వారు ‘కియా’ను స్థాపించారని చెప్పారు. 2017 ఏప్రిల్‌లో ‘కియా’తో ఎంఓయూ చేసుకున్నామని, తక్కువ కాలంలోనే ‘ట్రయల్‌ ప్రొడక్షన్‌’ను ప్రారంభించామని పేర్కొన్నారు. మరో ఆర్నెల్లలో కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామన్నారు. ‘‘నా జీవితంలో ఎప్పుడు హెలికాప్టర్‌లో తిరిగినా, ఇండియాలో.. పైగా అనంతపురంలో ఇంత మంచి ప్రాజెక్టు వస్తుందని ఊహించలేదు. కానీ సాధ్యమైంది. గతంలో వోక్స్‌వ్యాగన్, ప్రోటాన్‌ పరిశ్రమలు వస్తాయనుకున్నా! వోక్స్‌వ్యాగన్‌ పుణేకు తరలిపోయింది. దీంతో ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలంటే అంతా భయపడ్డారు. నేనున్నానని చెప్పాను. ఇది చంద్ర‌బాబు నిన్న‌టి మీటింగ్‌లో బ‌డాయి.

గొల్లపల్లి మ‌హానేత పుణ్య‌మే 
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అనంత‌పురం జిల్లాకు సాగునీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు తాను చేప‌ట్టిన జ‌ల‌య‌జ్ఞంలో పూర్తి ప్రాధాన్య‌త ఇచ్చారు. వైయ‌స్ హయాంలో మెజారిటీ నిర్మాణం పూర్తి అయిన హంద్రీనీవాకు సంబంధించిన క్రెడిట్ ను సొంతం చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్లు ప్రయత్నించారు. చేస్తే చేశారు.. కనీసం నీళ్లైనా ఇచ్చారా? అంటే.. అదేం లేదు. రెండ్రోజులు పంపులతో నీళ్లు కొట్టించి.. సీమ సస్యశ్యామలం అయిపోయిందని చంద్ర‌బాబు ప్రకటించారు.  చెంబుతో నీళ్లు పోసి నదుల అనుసంధానం అయిపోయిందన్నారు. అపర భగీరథుడిని తనే అని ప్రకటించుకోవడం అయ్యింది. ఆ తర్వాత అదంతా ప్రహసనం అయ్యింది. ఇక చెంబుల తర్వాత పంపుల వంతు వచ్చింది.. ఇదో ప్రహసనం! విషయం ఏమిటంటే.. హంద్రీనీవా కలను నెరవేర్చా అని ఇటీవలే బాబు చెప్పుకున్నారు. మా నాన్న కల తీరిందని బాలయ్యబాబు చెప్పుకున్నాడు.. అద్భుతం జరిగిందని అనుకూల మీడియా రాసింది!

కట్ చేస్తే.. సినిమా సెట్టింగులా తయారైంది పరిస్థితి. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగం అయిన అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్ లోకి నీళ్లు రావడం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. కాలువల నిర్మాణాలు అరకొరగా పూర్తి చేసి.. హడావుడిగా ప్రారంభోత్సవాన్ని చేసేశారు. అంతా అయిపోయిందని ప్రకటించారు. అయితే అసలు కథ అక్కడే ఆరంభం అయ్యింది. సరిగ్గా కాలువలు సాగి, రిజర్వాయర్ లోకి నీళ్లు ప్రవేశించకుండానే ప్రవాహం ఆగిపోయింది! కనీసం రిజర్వాయర్ సగం టీఎంసీ నీళ్లు చేరకుండానే.. నీటి సరఫరాను ఆపేశారు! అదేమంటే.. ఎగువ రిజర్వాయర్ లో నీళ్లు లేవు, కాలువల పనులు ఇంకా పూర్తి కాలేదు.. అనే మాటలు చెబుతున్నారు. దీన్ని ఏమనాలో సామాన్య మానవుడికి అయితే అర్థం కాదు!
ఇక మళ్లీ అతీగతీ లేదు.
చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన గొల్లపల్లి రిజర్వాయర్ కామెడీ అలా ఉంటే.. ఆ తర్వాతి ఫేస్ గురించి కామెడీ చేస్తున్నాడు మంత్రి పల్లె రఘునాథరెడ్డి. గొల్లపల్లి రిజర్వాయర్ నిండితే.. దాన్నుంచి నీళ్లు వదిలితే.. పుట్టపర్తి నియోజకవర్గం గుండా పోయే కాలువ ద్వారా నీళ్లు పోతాయి. అయితే.. ఈ కాలువ నిర్మాణంలో కొంత  పెండింగ్ పని ఉంది. రెండున్నర సంవత్సరం నుంచి అయినా ఆ పనులు పూర్తి చేయలేకపోతున్నారు. అయితే.. నీళ్లు వచ్చేస్తున్నాయి.. అంటూ పల్లె రఘునాథరెడ్డి కామెడీ చేస్తున్నాడు. గొల్లపల్లికే గతి లేకపోయినా.. ఆ తర్వాతి ఫేస్ గురించి ఈయన కబుర్లు చెప్పుకుతిరుగుతున్నారు!

ఆంధ్ర‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ కింద కియా మోట‌ర్స్‌
2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు. అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ , హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..
ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ' కియా ' మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని అభిలాష వ్యక్తం చేశారు..హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..
దానికి మోడీజీ వెంటనే స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది తమిళనాడు పొరుగునే ఉంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు.. ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కియా మోటార్స్ ను కేటాయించారు ..ఈ విషయం తండ్రిలాగా ఇంకా క్షుద్ర రాజకీయం తెలియని లోకేష్ గాంధీ అప్పట్లోనే కన్ఫర్మ్ చేశారు.. ఇక గుజరాత్ వాళ్ళ లిస్టులో లేదు. మోడీ కూడా ప్లాంట్ ఆంధ్రాలో పెట్టడానికే మొగ్గుచూపారు..ప్రధానిని కాదని ఒక ఊరూపేరూ తెలీని నాయకుడి మాట హ్యుందాయ్ లాటి సంస్థ వింటుందా? దీనికి సంబంధించి పచ్చ మీడియా కాకుండా ఏకంగా సౌత్ కొరియా మీడియా ' బిజినెస్ కొరియా లో 2015 లో మోడీజీ పర్యటన సందర్బంగా క‌థ‌నం ప్ర‌చురించారు.  

ఇక రెండో అంకం..
ప్లాంట్ శంకుస్థాపన జరగగానే ఒక ఎంపీ ఒక రాష్ట్ర మంత్రి తమ కమీషన్ల కోసం డీలర్ షిప్పుల కోసం కంపెనీ ఎండీ ను ముప్పతిప్పలు పెట్టడం మొదలెట్టారు..వీళ్ళ బాధ తట్టుకోలేక ఇండియా ఎండీ కంపెనీ చైర్మన్ కు మెయిల్ పెట్టారు .. ఇక్కడ ఆంధ్రాలో మనం ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయలేము ఇక్కడ అవినీతి రౌడీయిజం రాజ్యమేలుతున్నాయి అని..వెంటనే కంపెనీ చైర్మన్ చుంగ్ మాంగ్ కో ప్లాంట్ పనులు ఆపేసి వెంటనే సియోల్ ( కంపెనీ హెడ్ క్వార్టర్స్) రమ్మని ఆదేశాలు ఇచ్చారు..అప్పుడు ఆంద్ర పరిశ్రమల కార్యదర్శి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడితే మేము ఆంధ్రాలో ప్లాంట్ పెట్టలేం మాకు భద్రత లేదు పైగా అంత అవినీతి ఒత్తిడితో మేము వ్యాపారం చేయలేము ఇకపై మేము ఏం చెయ్యాలో నేరుగా ప్రధాని కార్యాలయంతో మాట్లాడతాము అని స్పష్టం చేశారు.. విషయం అర్ధమైన చంద్రబాబు ప్లాంట్ పొతే తన పరువు పోతుందని వెంటనే రంగంలోకి దిగి హుటాహుటిన అప్పట్లో అకస్మాత్తుగా సౌత్ కొరియా పర్యటన పెట్టుకొని కంపెనీ చైర్మన్ తో ప్రధాని కార్యాలయం ద్వారా అపాయింట్ మెంట్ ఇప్పించుకొని ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి మళ్ళీ ప్లాంట్ పనులు ప్రారంభం చేస్తామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని భారత్ వచ్చి  ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.. 
పెద్దలు చెప్పిన మాట నిజమే ' పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది '..
అప్పట్లో దిక్కులేని బాబు కి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..ఇప్పడు ఆంధ్రాకు మేలు చేస్తున్నవారిని కూడా తన అసత్య ప్రచారంతో కాటేశాడు..పుట్టుకతో వచ్చిన బుద్ది అది,ఎక్కడికి పోతుంది లే....

Back to Top