యూరియా... ఏదయ్యా?

 • యూరియా కొరతతో రైతు విలవిల..!
 •  నల్లబజారుకు తరలిన వైనం
 •  సొసైటీలు, మార్కెట్ యార్డుల వద్ద రైతుల పడిగాపులు
 •  చేష్టలుడిగిన చంద్రబాబు ప్రభుత్వం


 • హైదరాబాద్: రాష్ర్టంలో యూరియాకు కరవొచ్చింది... రాజధాని భూసేకరణపైనే దృష్టి  పెట్టిన ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదు. రుణమాఫీపై మాటతప్పిన చంద్రబాబు సర్కారు రైతులపై తనకున్న వ్యతిరేకతను ప్రతి పనిలోనూ నిరూపించుకుంటోంది. ‘రుణమాఫీ జరిగిందని చెట్ల కింద కూర్చోకండి.. తిని కూర్చుంటే షుగర్ వస్తుంది’ అని రైతులపై తనుకున్న అక్కసు వెళ్లగక్కిన బాబు.. ప్రస్తుతం ఎరువుల కొరతపై నిర్లక్ష్యాన్ని చాటుకుని రైతులపై తనకు ఎంత ప్రేమ ఉందో మరోసారి చాటుకున్నాడు.


  రైతులే కారణమంట: టీడీపీ మంత్రులు

  కొరత ఎందుకు వచ్చిందంటే..? రైతులే అధికంగా కొనుగోలు చేస్తున్నారంటూ మంత్రుల ద్వారా బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పంట కోసం ఎరువులు ఇప్పించాల్సింది పోయి.. వారిని ఎగతాళి చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీలు, మార్కెట్ యార్డుల ముందు రైతులు బారులు తీరుతున్నా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో..? అంతుపట్టడం లేదు. వ్యాపారులు విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోండడంపై ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

  బ్లాక్‌మార్కెట్ నియంత్రణలో చంద్రబాబు విఫలం..!

  ఈ రోజు రూ. 284లు అమ్మాల్సిన 50 కిలోల యూరియా బస్తాను రూ. 370 నుంచి 425 పెట్టి బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి రావటానికి కారకులెవరు? బ్లాక్ మార్కెటీయర్లను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ప్రభుత్వం అసలు పనిచేస్తుందా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.  రైతులకు యూరియానే సరఫరా చేయలేని ముఖ్యమంత్రి... లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తానంటూ సింగపూర్, జపాన్, దావోస్‌లలో తిరుగుతూ రైతులు, ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసిన మాట వాస్తవం కాదా? అని ప్రజలు నిలదీస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్లో ఎరువులు, విత్తనాలు అమ్మేవారు... అని పాదయాత్రలో ఊరూరా చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక చేసిందేమిటి? అని మండిపడుతున్నారు.


  మంట పెడుతున్న మంత్రుల వ్యాఖ్యలు


  ఒకవైపు యూరియా కొరత ఉన్నా... కొరత లేదన్నట్టుగా మంత్రులు చేస్తున్న ప్రకటనలు, వారికి ఊతం ఇస్తూ... కొన్ని పచ్చ పత్రికలు పిచ్చిరాతలపై రైతులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటో తెలుసుకోకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం మరింత అసహనానికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇవాళ కూడా రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా మంజూరు చేశామని, యూరియా కొరత లేదని, రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్నాడంటే- యూరియా ఏమైనా తినే సరుకా ఎక్కువగా కొనుగోలు చేసి దాచి పెట్టుకోవడానికి? అని రైతులు వాపోతున్నారు.

  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

  గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో 13 జిల్లాల్లో ఎంత యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్సు ఎరువులు సరఫరా చేశారు? రైతులకు చేరింది ఎంత?
  ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో యూరియా ఎంత వచ్చింది? ఎంత సరఫరా చేశారు?
  రబీలో ఎంత యూరియా వచ్చింది? ఎంత సరఫరా చేశారు?
  గత ఏడాదితో పోలిస్తే... 30 నుంచి 40 శాతం యూరియా రైతులకు చేరలేదు. మరో నెల రోజుల్లో సీజన్ పూర్తి అవుతున్నా... ఇప్పటికీ రైతులకు యూరియా అందని పరిస్థితి ఉందంటే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఈ మంత్రులు ఎక్కడ పోయినట్లు?

   రుణం మాఫీ కాదు.. యూరియా ఇవ్వరు..

   ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అన్నట్టుంది చంద్రబాబు సర్కారు తీరు. రుణమాఫీపై మాట తప్పింది. బ్యాంకులు రుణమాఫీ జరిగితే గానీ కొత్త రుణాలు ఇవ్వమని రైతులకు స్పష్టం చేశాయి. దీంతో ఒక్కరూపాయి కూడా కొత్త రుణాలు రాలేదు. పైగా చంద్రబాబు మాట విని భంగపడ్డ రైతులకు రూ. 14 వేల కోట్ల రూపాయలు వడ్డీ సమర్పించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ 14 వేల కోట్లు రైతులు వడ్డీకే రైతులు సమర్పించుకుంటే మీరు మాత్రం లక్ష కోట్ల రుణ మాఫీకి కేవలం రూ. 3900 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా 10 వేల కోట్లకు పైగా వడ్డీ రైతులు కట్టుకునే పరిస్థితి తెచ్చారు. మీ వల్ల రైతులు తీసుకున్న రుణాల అసలు బ్యాంకుల్లోనే ఉండిపోయింది. వడ్డీలు మాత్రం మూడు రెట్లు పెరిగాయి.

  తెలుగు జాతి చరిత్రలో 13 జిల్లాల రైతుల్ని  చంద్రబాబు తన హామీలతో నిలువునా అప్పుల్లో ముంచాడని రాష్ట్ర రైతాంగం మండిపడుతోంది. రుణ విముక్తులను కాదు- రుణ గ్రస్తులను చేశావు అంటూ బోరుమంటున్నారు. మూడు, నాలుగు తరాలపాటు రైతులు తలెత్తుకుని నిలబడలేని పరిస్థితి తెచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేయబట్టే- రైతులు మళ్లీ  రూ. 3, రూ. 4కి వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకున్న రుణాలలో ఈ సంవత్సరం జూన్ నుంచి డిసెంబరు లోపు ఖరీఫ్ సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో వారు ధాన్యాన్ని అమ్మితే వాళ్లకి మీరు చెక్కులు ఇచ్చారు. చెక్కులు ఎందుకు ఇచ్చారో మొదట అర్థం కాలేదు.  ఎందుకంటే- పంట అమ్మితే వచ్చిన డబ్బులను కూడా బ్యాంకుల్లో రైతులు బకాయిలు కట్టేందుకు ఉపయోగించాలనే కుట్రతోనే ఈ పని చేశావని రైతులంతా నిందిస్తున్నారు.ఇన్నీ చేశాక.. ఇక వ్యవసాయం ఎక్కడ బతుకుతుంది? రైతులు ఎరువు వేయటానికి ఏ పంట సాగు చేయగలడు? అయినా ఇల్లు తాకట్టు పెట్టో, పొలం తాకట్టు పెట్టో వ్యవసాయం చేస్తుంటే- ఆ కాస్త ఎరువుల్ని కూడా సరఫరా చేయలేని మీరు- ఈ రాష్ట్రంలో కోట్ల మంది రైతుల్ని ముంచినందుకు మీకు ఏ శిక్ష వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

       
  సొంత డబ్బాకు తక్కువేం లేదు..

  ‘మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ కావాలన్నాడంట వెనకటికి ఒకడు.. సరిగ్గా అలాగే ఉంది చంద్రబాబు తీరు. నోరు తెరిస్తే.. ఖజానా ఖాళీగా ఉంది.. అంటూ దొంగ ఏడుపులు, పెడబొబ్బలతో కాలం వెళ్లదీస్తున్న చంద్రబాబు విదేశీ యాత్రలు చేసే సమయంలో కోట్లకొద్దీ ప్రజాధనం ఖర్చు అవుతుందన్న సంగతి గుర్తుకు రాకపోవడం గమనార్హం. అలా అని ప్రచారంలో ఏమన్నా తగ్గారా? అంటే అదీ లేదు. ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పచ్చ పత్రికలు ఆయన భజన చేయడంలో మునిగిపోయాయి.

   పచ్చ పత్రికల ప్రచారం ఎలా ఉందంటే..?

   ఒబామా వస్తున్నాడ న్న మరుక్షణం- చంద్రబాబు కలుస్తున్నాడు.. చంద్రబాబుని కలవటానికే ఒబామా భారత్ వస్తున్నాడన్నట్టుగా ఎల్లో గ్యాంగ్, పచ్చ పత్రికలు హోరెత్తించాయి. మొన్న కూడా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చంద్రబాబు కోసం చాలా సేపు వేచి చూశారన్నట్టుగా కొన్ని పచ్చ పత్రికలు రాశాయి. చంద్రబాబును కలవలేకపోతున్నందుకు మనోవేదనకు గురయ్యారని, కలిశాక ఎగిరి గంతు వేశారన్నట్టుగా ఆ పత్రికలు రాశాయి.  చంద్రబాబే ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయితే బాగుంటుందన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరితే ఒబామా తిరస్కరించారా? లేక చంద్రబాబే తిరస్కరించారో ప్రజలకు చెప్పాలి.  ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ వ్యవసాయాన్ని పండగ చేయటానికి, సింగపూర్ లాంటి రాజధాని కడుతుండటం వల్ల ఒబామా అపాయింట్ మెంట్ వద్దని అన్నారా? మీరే ఒబామాకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని మీ కమ్యూనికేషన్ అడ్వైజర్ చేత ఒబామాకు చెప్పించారా చంద్రబాబూ? దయచేసి చెప్పండి?

  జిల్లాల వారీగా రైతులు పడుతున్న కష్టాలు ఇలా ఉన్నాయి...!

  గుంటూరు జిల్లా రేపల్లె  రైతులకు మళ్లీ యూరియా కష్టాలు తప్పటం లేదు. నిన్న మొన్నటి వరకు ఖరీఫ్ సాగులో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రైతులకురబీలోనూ అదే పరిస్థితి ఎదురైంది. రోజుల తరబడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చుట్టూ తిరిగినా బస్తా యూరియా లభించడం కష్టమవుతోంది. సొసైటీలకు వస్తున్న యూరియా పాలకుల సిఫార్సులతో అడ్డదారిలో వెళ్లిపోతోంది. క్యూలో ఉంటున్న రైతులకు కాళ్లతీతలే మిగులుతున్నాయి. ఇసుకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద వారం రోజులుగా యూరియా కోసం రైతులు బారులు తీరుతూనే ఉన్నారు. \

   విజయవాడ నియోజకవర్గంలో.. 

  అలాగే విజయవాడ నియోజకవర్గంలోని  వేమూరు మండలంలోనూ ఎరువు కొరత తీవ్రంగా ఉంది. ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు ప్రారంభం  నుంచి  రబీలో మొక్కజొన్న , జొన్న పంటలకు రైతు వారీ పద్ధతిలో యూరియాను ఎక్కువగా వినియోగించటం సర్వసాధారణం. ఇతర ఎరువులైన కాంప్లెక్స్‌లతో యూరియాతో జతచేసి జల్లటం వ్యవసాయంలో పరిపాటి. వరి సాగు ప్రారంభంలో దమ్ములో ఒకసారి, తదుపరి రెండు దఫాలుగా , మొక్క జొన్న , జొన్న  పంటలకు 20 దశలలో ఒకసారి, మరో మూడు పర్యాయాలు యూరియాను రైతులు వినియోగిస్తారు. మండలంలో మొత్తం 21 వేల ఎకరాల విస్తీర్ణంలో మాగాణి భూమి ఉంది. ఖరీఫ్ సీజన్ ముగియటంతో ప్రస్తుతం రబీలో రెండో పంటగా మండలంలో 15 వేల ఎకరాల్లో మొక్క జొన్న, మూడు వేల ఎకరాల్లో జొన్న, మరో మూడు వేల ఎకరాల్లో మినుము, పెసర పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో మొక్క జొన్న పంటకు ఎకరాకు 300 కిలోల చొప్పున యూరియా అవసరమవుతుందని రైతులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

   
  నెల్లూరు జిల్లాలో కూడా..


  నెల్లూరులోనూ అన్న దాతలను యూరియా కష్టాలు వీడటం లేదు. రైతులు ఎరువుల కోసం  అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా కూడా చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు.  సోమవారం జిల్లాలో పలు ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల ఎదుట అన్న దాతలు బారులు తీరారు. రోజంతా యూరియా కోసం క్యూలో నిలబడ్డా అందక పోవడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు అధికార పక్షాల పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.


  విజయవాడ నియోజకవర్గంలో..


  విజయవాడ నియోజకవర్గంలోని  వేమూరు మండలంలో   పంటకు ప్రధానంగా కావాల్సిన ఎరువు యూరియా ఇప్పుడు అత్యంత ప్రియంగా మారింది. ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు ప్రారంభం  నుంచి  రబీలో మొక్కజొన్న , జొన్న పంటలకు రైతు వారీ పద్దతిలో యూరియాను ఎక్కువగా వినియోగించటం సర్వసాధారణం. ఇతర ఎరువులైన కాంప్లెక్స్‌లతో యూరియాతో జతచేసి జల్లటం వ్యవసాయంలో పరిపాటి. వరి సాగు ప్రారంభంలో దమ్ములో ఒకసారి, తదుపరి రెండు దఫాలుగా , మొక్క జొన్న , జొన్న  పంటలకు 20 దశలలో ఒకసారి, మరో మూడు పర్యాయాలు యూరియాను రైతులు వినియోగిస్తారు. మండలంలో మొత్తం 21 వేల ఎకరాల విస్తీర్ణంలో మాగాణి భూమి ఉండగా ఖరీఫ్ సీజన్ ముగియటంతో ప్రస్తుతం రబీలో రెండో పంటగా మండలంలో 15 వేల ఎకరాల్లో మొక్క జొన్న, మూడు వేల ఎకరాల్లో జొన్న, మరో మూడు వేల ఎకరాల్లో మినుము, పెసర పంటలు సాగుచేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో మొక్క జొన్న పంటకు ఎకరాకు 300 కిలోల చొప్పున యూరియా అవసరమవుతుందని రైతులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో యూరియా కొరత రైతులను త్రీ ఆందోళనకు గురిచేస్తుంది.
Back to Top