చంద్రబాబు గుడ్ కాబట్టి అంతా గుడ్ అన్నమాట

ఓటుకి కోట్లు కుంభకోణం లో
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు అందరికీ ఆదర్శనీయంగా నిలుస్తున్నాడు.
అందుకే ఆయన్ని ప్రభుత్వ యంత్రాంగం బాగానే అనుకరిస్తోంది.

ప్రభుత్వ శాఖల్లో అవినీతి
చేసి దొరికిపోయిన ఉద్యోగులు, అధికారులపై ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. ఫిర్యాదులు
అందినప్పుడు ఆయా శాఖల్లోని విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉంటోంది. కానీ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం
లో కింద నుంచి పై దాకా అంతా సెటిల్ మెంట్ రాయుళ్లతో పుచ్చిపోయింది కాబట్టి
విజిలెన్స్ విభాగానికి చిక్కులు వచ్చిపడుతున్నాయి.

విజిలెన్స్ విభాగం నుంచి
నివేదిక వచ్చినప్పుడు దాన్ని ఆయా శాఖల అధిపతులు విచారణ జరుపుతారు. అభియోగాలు ఎదుర్కొంటున్న
అధికారి వివరణ కూడా సేకరించి తీసుకోవాల్సిన చర్యల మీద నివేదిక ఇస్తారు. ఈ నివేదిక
ఆధారంగా ప్రభుత్వం సదరు అధికారి లేక ఉద్యోగిమీద చర్యలు తీసుకొంటుంది. ఇక్కడే పచ్చ
చొక్కా లప్రమేయం మొదలవుతోంది.

పూర్తి స్థాయిలో అవినీతి
ఆరోపణలు ఉన్నప్పటికీ తెలుగుదేశం నాయకుల ఆశీస్సులు ఉంటే చాలు, సదరు అధికారి లేక ఉద్యోగి
మీద ఎటువంటి చర్యలు ఉండటం లేదు. ఈ 17 నెలల కాలంలో 49 కేసులకు చెందిన 118 మంది
అవినీతి అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చి పంపించేశారు.దీని మీద విజిలెన్స్ అధికారులు
మల్లగుల్లాలు పడుతున్నారు. కష్టపడి 
ఆధారాలు సేకరించి కేసు కడితే చివరకు ప్రభుత్వ పెద్దలే నీరు గారిస్తేతాము ఏం
చేయగలమని వాపోతున్నారు.

ప్రభుత్వానికి అధిపతి అయిన
చంద్రబాబు .. ఓటుకి కోట్లు కుంభకోణంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా గర్వంగా
పరిపాలన చేస్తుంటే.. ఇటువంటివి తప్పవని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top