ప్రాంతాలు వేరైనా మనోగతం ఒకటే…

సంకల్పం
ఓ ఉక్కు పిడికిలి.  సంకల్పం లక్ష్యానికి మజిలీ. ప్రతిపక్ష నాయకులు,
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధినేత,  వైయస్
జగన్ మోహన్ రెడ్డిది అచ్చం అలాంటి సంకల్పమే.వైయస్
జగన్ మోహన్ రెడ్డి చేరుకునేది అలాంటి విజయ తీరాన్నే. ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరంభమై200 రోజులు కాబోతున్నాయి. ఆ పాదాలు
నేలను ఆర్తిగా తాకుతున్నాయి. పచ్చికను పలకరిస్తున్నాయి. ప్రకృతితో
కలిసి కదులుతున్నాయి. ప్రజల వైపుకే తమ పయనం అని తెలుపుతున్నాయి. ఓ యాత్రకు
సార్థకత ఇంతకంటే ఏం కావాలి.



లెక్కేసుకోడాల్లేవ్

రోజుల
లెక్కలు కాదు. కిలోమీటర్ల కొలతలు కాదు. అభిమానాల తూకం కాదు. ప్రజా
సంకల్పం చిగురించిన ఆశలకు అది ప్రతిరూపం. పోటెత్తుతున్న ప్రజాభిమానానికి
నిలువెత్తు నిదర్శనం. కాదనగలవాడు లేదు. కళ్లు
చించుకున్నా, కళ్లలో నిప్పులు పోసుకున్నా కోటి సూర్యప్రకాశంలాంటి ఆ ప్రభను
ఆపలేకపోయారు. సర్వేలు, రిపోర్టులంటూ టిడిపి వేసుకున్నట్టు లెక్కేసుకోడాల్లేవ్…జన హోరు జగన్ జోరు ఆగకుండా సాగిపోతూనే ఉంది. 2500 కిలోమీటర్లకు
చేరువ అవుతున్న యాత్ర. 200 రోజులను పూర్తి చేసుకోనున్న యాత్ర.
జన ప్రభంజనమై, జగన్నినాదమై సాగుతున్న వేళ ఆ జననేత
అడుగులు సాగిన నియోజక వర్గాలు, ఆ ప్రాంతంలో వెల్లివిరిసిన ఉత్సాహాల
గురించి ఓ సారి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేలలు
వేరు, నేపథ్యాలు వేరు. ప్రజల పరిస్థితులు,
స్థితిగతులూ వేరు. కానీ వారందరి మనస్సుల్లో ఉన్న
ఆశ ఒక్కటే. వారి ఆశయ సాధకుడు ఒక్కడే.

ప్రజా
సంకల్పం సాగిన తీరు

నవంబర్
6, 2017 వైయస్ఆర్
 జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రజా
సంకల్పానికి తొలి అడుగు పడింది. వైఎస్సార్ ఘాట్ వద్ద ఉద్వేగపూరిత
వాతావరణంలో, తల్లి ఆశీస్సులు అందుకున్ని యువనేత తన ప్రస్థానానికి
శ్రీకారం చుట్టారు. పులివెందుల, కమలాపురం,
జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో యువనేత ప్రతి అడుగూ ఓ నవ చరితకు నాంది పలికింది.
ఈ జిల్లాలో మొత్తంగా 91.5 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప
యాత్ర సాగింది. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో యువనేతకు ఘన స్వాగతం
లభించింది. ఆళ్లగడ్డ, బనగానపల్లి,
డోన్, పత్తికొండ, కోడుమూరు,
ఎమ్మిగనూర్, ఆలూర్ నియోజక వర్గాల మీదుగా వైఎస్
జగన్ ప్రజా సంకల్పం 255.5కిలోమీటర్లు అప్రతిహతంగా కొనసాగింది.
ప్రజా సంకల్పం అనంతపురాన అడుగు పెట్టింది. గుంతకల్,
తాడిపత్రి, సింగనం, ఉరవకొండ,
రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి,
కదిరి నియోజకవర్గాల్లో వైరిపక్షాల గుండెల్లో దడలు పుట్టిస్లూ 264.8
కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ వెంకన్న ఆశీస్సులు
అందుకుని ఆరంభించిన ప్రజా సంకల్పం చిత్తూరు జిల్లాలో 10 నియోజకవర్గాల
మీదుగా సాగింది. తంబళ్లపల్లి, మదనపల్లి,
పీలేరు, పుంగునూరు, పూతల
పట్టు, జిడి నెల్లూర్, చంద్రగిరి,
నగరి, శ్రీకాకుళం, సత్యవేడు
నియోజకవర్గాల్లో 289.8 కిలోమీటర్లు ప్రజాసంకల్పయాత్ర సాగింది.
రాయలసీమ బిడ్డను, నవరత్నాలను అందిస్తానని మాటిచ్చిన
మహానేత తనయుణ్ణి మనసారా గుండెలకు హత్తుకున్నారు సీమవాసులు. నెర్రెలు
చాచిన నేలలు, నీళ్లు లేని నగరాలు, నిత్యం
దుర్భిక్షం, ఉపాధి లేక అల్లాడుతున్న ప్రజలకు నేనున్నాననే భరోసా
కల్పించారు వైయస్ జగన్.

నెల్లూరు
జిల్లాలో సూళ్లూరిపేట, గూడురు, వెంకటగిరి, సర్వేయపల్లి,
కొవ్వూరు, ఆత్మకూరు, కావలి,
ఉదయగిరి నియోజక వర్గాల మీదుగా ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ప్రకాశంలో కందుకూరు, కనిగిరి, మార్కాపురం,
సంతన నూతల పాడు, దర్శి, అద్దంకి,
పర్చూరు, చీరాల ప్రాంతాలు మహానేత తనయుడికి నీరాజనాలు
పట్టాయి.

పల్నాటి
సీమ, నేటి
రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలు వైయస్ జగన్ ను ఆదరించిన
తీరు చూస్తే జననేతపై వారికున్న అభిమానం ఏమిటో అర్థం అవుతుంది. కృష్ణా జిల్లాలో జగన్ అడుగుపెట్టిన సందర్భంలో వెలువెత్తిన ప్రజాభిమానం
తాకిడికి దుర్గమ్మ వారథి ఊగిసలాడి, ప్రజాకంటకుల వెన్నులో వణుకు పుట్టించింది. అభివృద్ధి
పేరు చెప్పి, రాజధాని కలలు చూపి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అరాచకాలను అడుగడుగునా
జననేతకు చెప్పుకున్నారు ఆ ప్రాంత వాసులు. రాబోయేవి మంచి రోజులన్న
ప్రతిపక్ష నేత మాటలే వారికి కొండంత భరోసానిచ్చాయి.

ఉభయగోదావరి
జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర నభూతో నభవిష్యతి అన్నట్టు సాగుతోంది. ఈ జిల్లా వాసులు రాజన్న
బిడ్డకు  పలికిన అపూర్వ స్వాగతాన్ని చూసి ఇలా
ఇంకెవ్వరికీ జరగలేదు, మరెవ్వరికీ జరగబోదని అనుకోని రాజకీయ నాయకుడు
లేడు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మంగళహారతులు పడితే,
తూర్పుగోదావరి జిల్లా వాసులు గోదారంత అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సాగుతున్న ప్రజాసంకల్ప
యాత్రలో యువనేత ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రతి బహిరంగ
సభలోనూ ప్రజావెల్లువకు ప్రేమపూర్వక నమస్సులు తెలియజేస్తున్నారు. ఈ సంకల్పం కొనసాగుతుంది. ప్రజల మనసులను గెలుచుకుంటూ,
ప్రగతి బాటలు మలుచుకుంటూ మున్ముందుకు సాగుతుంది.

*(బుధవారం (27 వ తేదీ) నాటికి ప్రజా సంకల్పయాత్ర 200 రోజులు పూర్తి
చేసుకుంటున్న సందర్భంలో ప్రత్యేక కథనం)

 

Back to Top