బాబు బృందంలో నల్ల ధనవంతులుకోట్లకు పడగలెత్తిన టీడీపీ నేతలుపెద్ద నోట్ల రద్దు కాకముందే బ్లాక్‌ను వైట్ చేసుకున్న తమ్ముళ్లువిదేశాలకు ప్రత్యేక విమానాల్లో నల్లధనం తరలించిన ఏపీ సీఎంఅధినేత బాటలోనే అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుమిత్రపక్షంపై కన్నేయని కేంద్ర ప్రభుత్వంమోదీ నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుల అవస్థలు నిప్పుకు చెదలు పట్టింది. ఇదెలా సాధ్యం అంటారా...? వీడెవరో తప్పులో కాలేశాడని అలా ఆశ్చర్యంగా చూడకండి. ఇక్కడ నిప్పు అంటే ఎవరో కాదు. మన ముఖ్యమంత్రి వర్యులు.. ప్రపంచ మేధావి చంద్రబాబే. చెదలు ఏంటంటారా.. అదేనండీ అవినీతి చెద. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తెలుగు దేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబే దీనికి ఆధ్యుడు. అవినీతి సొమ్మును రహస్యంగా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తరలించి బ్లాక్‌ను వైట్ చేసుకున్నారు. చంద్రబాబు ఇప్పటికే 16 సార్లు పెట్టుబడుల పేరుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాలేదు. ఇలా వెళ్లిన చంద్రబాబు విదేశాల్లో డబ్బు దాచుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తుందన్న సమాచారం ముందుగా తెలుసుకున్న చంద్రబాబు జాగ్రత్త పడ్డాడు. తన బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకుని, ఆ తరువాత తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సేవ్ చేశారు. పని పూర్తయ్యాక ఏమి తెలియనట్లు, తాను నిజాయితీపరుడిని అన్నట్లు బిల్డవ్ ఇస్తూ పెద్ద నోట్ల రద్దు పదం అందుకున్నాడు. తాను లేఖ రాయగానే ప్రధాని స్పందించి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. ఇది తన క్రెడిటే అంటూ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. కేంద్రం నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పు, పప్పు కొనేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటిల్లిపాది పస్తులుంటున్నారు. దీనికి బాబు ఏం సమాధానం చెబుతారు. గుట్టుచప్పుడు కాకుండా తన అవినీతి సొమ్మును ముందస్తుగా మార్పిడి చేసుకొని నంగనాచిలా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్న బాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల కష్టాలు పట్టించుకోని బాబుపై రాష్ట్ర ప్రజానీకం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
బాబు బృందమంతా డిఫాల్టర్లేబాబు చుట్టూ ఉన్న మందిమాగాదులను చూస్తే వేలకోట్లకు పడగలెత్తి కనీసం పది పదిహేను కంపెనీలకు ఎండీలుగా ఉన్నవారే ఉంటారు. బాబు పక్కన కూర్చోవాలంటే వారికుండాల్సిన కనీస అర్హత అది. అయితే వారంతా పైకి వేల కోట్లు ఉన్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నా అదంతా జనం సొమ్మే. సుజనా చౌదరి, సీఎం రమేష్, రాయపాటి సాంబశివరావు, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టుంది. బ్యాంకుల్లో మనం దాచుకున్న సొమ్మును అప్పుగా తీసుకుని పారిశ్రామిక వేత్తలుగా చెలామణీ అవుతున్నవారే వీరంతా. అందరూ బ్యాంకులను బురిడీ కొట్టించినవారే. వందలు.. వేల కోట్లు అప్పులు తీసుకుని చెల్లించకుండా బ్యాంకర్లను మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు. వారి నుంచి బాకీలు వసూలు చేయలేక బ్యాంకర్లు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ మిత్రపక్షమైన టీడీపీ నల్లకుబేరుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా వారిని రక్షణగా నిలబడ్డారు. తీరా నష్టపోయింది మాత్రం సామాన్య జనమే.