దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై టీడీపీ వైఖరి ఏంటి? 

రిజర్వేషన్ల తొలగింపును వ్యతిరేకిస్తున్నాం.. ఇతర పార్టీలు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలి

మాజీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ 

 రామచంద్రపురం : దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల తొలగింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎంపీ  సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల తొలగింపును వైయ‌స్ఆర్‌సీపీ ఇప్పటికే స్పష్టంగా వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేసేలా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే ఎలాంటి చర్యలనైనా వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ఈ అంశంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త  పిల్లి సూర్యప్రకాష్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top