నారా హమారా కాదు దుబారా!

ఓట్లకోసం నానా గడ్డీ కరచడం, కపట ప్రేమ నటించడం, నోటికొచ్చిన హామీలు గుప్పించడం.. తీరా కుర్చీ ఎక్కిన తర్వాత అందరినీ నట్టేట ముంచడం బాబుకి బాగా తెలిసిన విద్యే. ఇంత అన్యాయం చేసి కూడా మళ్లీ ఎన్నికలముందు ఎక్కడలేని ప్రేమ నటించాలంటే అది ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడికే సాధ్యం. రెప్పార్పకుండా వెయ్యి అబద్ధాలైనా ఆడగల ఈ దిట్ట నాయకుడు... ఎన్నికలు సమీపిస్తున్నాయంటే రంగులు మారుస్తూ కొత్త కొత్త నాటకాలకు తెరతీస్తూ ఉంటాడు. ఇప్పుడు మైనారిటీల ఓట్లకోసం చేస్తున్నది కూడా అలాంటిదే. నాలుగున్నరేళ్లుగా ముస్లింల ఊసే ఎత్తని బాబు ఇప్పుడు ఏకంగా హమారా హమారా అంటూ ఓట్లరాజకీయం మొదలుపెట్టాడు. ఇన్నాళ్లూ తన కేబినెట్లో ముస్లింల ప్రాతినిథ్యమే లేదన్న విషయం పక్కకు పెట్టేసి వారిపై ప్రేమ ఒలకబోసే నాటకానికి సన్నాహాలు చేస్తున్నాడు. దేశంలోనే ముస్లిం సోదరుల ప్రాతినిధ్యం లేని ఏకైక క్యాబినెట్ గా ఘనత వహించిన ఈ మైనారిటీ ప్రేమికుడు ఇప్పుడు వారి నోటివెంటే నారా హమారా టిడిపి హమారా అనిపించాలని విశ్వప్రయత్నాలు చేయడం చూస్తే రాజకీయాలకే వళ్లు గగుర్పొడుస్తుంది. బాబూ నీ ప్రభుత్వంలో మైనారిటీలు ఎక్కడ? అని అడిగితే... పెద్ద పెద్ద పదవులే ఇద్దామనుకున్నాను కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు అని తప్పించుకున్నాడు. తన గారాల పప్పుకి మాత్రం ఎమ్మెల్సీ అచ్చి నేరుగా కేబినెట్ లో కూర్చోబెట్టుకున్నాడు. నిజంగానే తన మనసులో ముస్లిం హమారా అనే భావన ఉంటే అదే పని వారిని ప్రభుత్వంలో భాగస్వాముల్ని చేయడానికి చేసి ఉండవచ్చు కదా! వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితులు అంటే చంద్రబాబుకి ఓట్లు మాత్రమే. వాళ్లెనెప్పుడూ సమాన హక్కులున్న మనుషులుగా కూడా పరిగణించడం బాబు జీవితంలోనే లేదు. ముస్లింలకు కేటాయించిన బడ్జెట్లోనే 30 శాతం కూడా ఖర్చు చేయని నారా... ఇప్పుడు వారికి మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టడం, ఇమామ్, మౌజన్ లకు గౌరవవేతనాలని కొత్ వరాలివ్వడం ఆయన ఎన్నికల కపటనాటకంలో భాగమేనని ముస్లింలకు కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. అందుకే వారంతా నారా హమారా కాదు నారా దుబారా అంటున్నారు.

Back to Top