పారిశ్రామిక వేత్తలకు దాసోహమైన పచ్చసర్కార్..!

ప్రజాసమస్యలపై చర్చేలేదు..!
అవినీతి ప్రభుత్వం..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అధికారపార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై ఎలాంటి చర్చ లేకుండా కేబినెట్ సమావేశం జరగడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు 33 ఏళ్లు కాదు,99 ఏళ్లు లీజుకిస్తామని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. అదే సామాన్య రైతులు సాగుచేసుకునేందుకు 99 ఏళ్లపాటు  లీజుకు ఇవ్వగలరా అని  ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టెందుకే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఇది సామాన్యుల ప్రభుత్వం కాదని, అవినీతి ప్రభుత్వమని పద్మ ఫైరయ్యారు. పచ్చసర్కార్ పారిశ్రామికవేత్తలకు దాసోహం అయ్యిందని, వరల్డ్ బ్యాంక్ అడుగులకు మడుగులు వత్తుందని అన్నారు.

ఏ ఒక్కటైనా చేశావా..!
బ్లాక్ మార్కెట్ నిల్వలపై తగిన చర్యలు తీసుకోవడంలోగానీ,  ధరలను అదుపులోకి తేవడంలో గానీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టా సహా పంటలన్నీ ఎండిపోతుంటే రైతులకు ధైర్యం చెప్పేవిధంగా కేబినెట్ లో ఎంలాటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా శకం ముగిసిందని చెప్పినా దానిపై ఎలాంటి చర్చ చేయలేదని దుయ్యబట్టారు. మంత్రివర్గ సమావేశంలో చేసిన ఘనకార్యం ఏదైనా ఉందంటే ..ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు అమ్మేవేసే  నిర్ణయం తప్ప ఇంకేమీ లేదన్నారు. 

సెటిల్ మెంట్ కోసమే..!
పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పర్చేందుకే రైతుల భూములు లాక్కుంటున్నారని పద్మ ఫైరయ్యారు. అక్రమ ఇసుక, ఎర్రచందనం అరికట్టేందుకు సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తామంటున్న చంద్రబాబు...అది కుంభకోణాల కోసమే తప్ప బాగు కోసం కాదన్నారు. అధికారులపై దాడి చేసి సెటిల్ మెంట్ చేసుకునేందుకే కెమరాల ఏర్పాటు అని ఎద్దావే చేశారు. కాపులకు ఐదేళ్లలో ఐదుకోట్లు ఇస్తామన్న చంద్రబాబు మొండిచేయి చూపారన్నారు.
Back to Top