హోదా మాటెత్తని పచ్చ చొక్కాలు- పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశాల్లో సైలెంట్ అయిన టీడీపీ ఎంపీలు
- మొద‌టి నుంచి హోదా కోసం పోరాడుతున్న వైయ‌స్ జ‌గ‌న్‌
- కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గర్హిస్తూ ఈ నెల 27 వ తేదీన ఢిల్లీలో దీక్ష 
అమ‌రావ‌తి: తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటనే చంద్రబాబు ఏపనైనా చేస్తారు. నాలుకను ఎటంటే అటు తిప్పడమే కాకుండా, తనను , తన పార్టీని సైతం తిప్పగల సమర్ధుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంత కాలం , బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించారు. అసలు హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలకు పోయారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తెస్తోంది. హోదా కోసం ఎందాకైనా అంటూ ముందుకు సాగుతోంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రజల్లో చైతన్యం పెల్లుబుకుతున్న పరిస్థితులతో పాటు, బిజెపితో ఉన్న సంబంధాలు బెడిసి కొట్టడంతో చంద్రబాబు హోదా పై యూటర్న్ తీసుకుని కొత్త రాగం అందుకున్నారు. తానే ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ, తన పచ్చమీడియా ద్వారా  ప్రచారం చేసుకుంటున్నారు. తనకు మించిన పోరాట యోధుడు లేడంటూ చెప్పుకుంటున్నారు. ఇంత చేస్తున్న ఈ పెద్దమనిషి, తనపార్టీకి చెందిన ఎంపిల తో  పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదాపై మాట్లాడించలేకపోయారు. గతంలో లావు తగ్గడానికే నిరాహార దీక్షలు చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటించిన టిడిపి ఎంపిలు కూడా ప్రస్తుత సమావేశాల్లో హోదా అంశంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఉంటున్నారు.

ప్రస్తుత లోకసభ లో చివరి శీతాకాల సమావేశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని, కేంద్రంపై వత్తిడి తేవాల్సిన టిడిపీ ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించడం ఆ పార్టీ అవకాశవాద రాజకీయాలకు దర్పణంగా నిలుస్తోంది. ప్రత్యేక హోదా పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన  5 మంది లోకసభ సభ్యులు, మాజీ ఎంపీలు శీతాకాల సమావేశాల ప్రారంభపు రోజు నుంచి పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు, నినాదాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ఇద్దురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రతి రోజూ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా , విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గర్హిస్తూ వంచన పై గర్జన దీక్షలు చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఈ నెల 27 వ తేదీన ఢిల్లీలో దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ప్రాణమున్నంత వరకు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతూనే ఉంటానని ప్రకటించిన వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి సంకల్ప దీక్షకు ఈ పోరాటాలన్నీ నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

ప్రత్యేక హోదా ను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ,  ఎవరూ ఇవ్వని పెద్దరికాన్ని నెత్తినేసుకుని జాకీయ రాజకీయాలంటూ పార్టీల చుట్టూ చక్కర్లు కొడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

తాజా వీడియోలు

Back to Top