ఆ టీడీపీ మంత్రి గారికి చట్టాలన్నీ చుట్టాలే..!


() ఆస్తి పన్ను కట్టని
మంత్రి పల్లె రఘునాథరెడ్డి సంస్థలు

() అటు వైపు కన్నెత్తి చూడని
అధికారులు

() మంత్రి బాటలోనే
ఎమ్మెల్యే సూరి సైతం

అనంతపురం) పన్ను కట్టడం
పౌరుల బాధ్యత. ఈ విషయం మరిచిపోతే సామాన్యుల్ని అధికార యంత్రాంగం బాగానే
సతాయిస్తుంది. కానీ, రాష్ట్ర ఐటీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, అయన అనుచరుడు,
టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మాత్రం ఇందుకు మినహాయింపు. బడా నేతలు కావటంతో
లక్షల్లో బకాయిలు ఉన్నా, అధికారులు నోరు మెదపటం లేదు.

మంత్రి సంస్థలదే పెద్ద
బకాయి

అనంతపురం జిల్లాలో
మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన విద్యా సంస్థలతోటే చిర పరిచితులు. బాలాజీ ఎడ్యుకేషన్
సొసైటీ పేరుతో ఆయన విద్యా సంస్థలు నిర్వహిస్తుంటారు. ఈ సంస్థలకు అనంతపురం నగరంలో
స్థిరాస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు పేరుకొని పోయాయి.
డోర్ నెంబర్ 13-3-612 భవనానికి
సంబంధించిన బకాయి రూ. 10,20,574, అలాగే డోర్ నెంబర్. 13-3-610 భవనానికి సంబంధించిన  బకాయి రూ. 8,85,122
ఉన్నాయి. మరో భవనం డోర్ నెంబర్ 13-3-612  కు సంబంధించిన బకాయి రూ. 7,79,849  మేర పేరుకొని పోయాయి. మొత్తం మీద
మంత్రి పల్లె సంస్థలకు సంబంధించిన బకాయిలే పాతిక లక్షలకు పైగా పేరుకొని పోయాయి.

మంత్రి ని ఆదర్శంగా
తీసుకొన్న ఎమ్మెల్యే

తెలుగుదేశం ఎమ్మెల్యే
వరదాపురం సూరి ఏ ఏ విషయాల్లో మంత్రి పల్లె ను ఆదర్శంగా తీసుకొన్నారో తెలీదు కానీ,
పన్ను బకాయిల విషయంలో మాత్రం బాగానే అనుసరిస్తున్నారు. జి. నిర్మలాదేవి పేరు మీద
ఉన్న ఆస్తులకు సంబంధించిన బకాయిలు బాగానే ఉంచుతున్నారు. డోర్ నెంబర్ 15-323కు సంబంధించిన భవనానికి రూ.7,16,
223, మరొక భవనం డోర్ నెంబర్ 15-325 కు
సంబంధించి రూ.6,77,055, ఇంకొక భవనం డోర్ నెంబర్
15-322కు సంబంధించి రూ. 3,43,533 మేర బకాయిలు
ఉంచేశారు. దాదాపు రూ. 17 లక్షల మేర నగర పాలక సంస్థకు బకాయిలు పడినట్లుగా అధికారులు
లెక్క వేశారు.

పెద్ద వాళ్లతో గొడవ
ఎందుకని..

సహజంగానే మార్చి నెల
వచ్చిందంటే నగర పాలక సంస్థ అధికారులు పన్నుల వసూళ్ల కోసం నోటీసులు ఇస్తుంటారు.
సామాన్యుల దగ్గరకు సిబ్బందిని పంపించి వసూళ్లకోసం హడావుడి చేస్తారు. కానీ, టీడీపీ
నేతలు లక్షల రూపాయిల్లో బకాయిలు పడినా కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఒక
ఆర్థిక సంవత్సరంలో 85 శాతం కన్నా అధికంగా పన్నులు వసూలు చేస్తే ప్రత్యేక గ్రాంట్
దక్కుతుంది. అయినా సరే నగర పాలక సంస్థ బకాయిదారుల వైపు చూడకుండా జాగ్రత్త
పడుతోంది. 


To read this article in English:    http://goo.gl/w1G0dZ 

Back to Top