ద‌ళిత తేజ‌మా?.. ద‌ళితుల‌కు ద్రోహ‌మా?చంద్ర‌బాబు నాయుడు చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు అస‌లు పొంత‌నే ఉండ‌ద‌న్న‌ది మ‌రొసారి రుజువైంది. 2014 ఎన్నిక‌ల ముందు ద‌ళితుల సంక్షేమ‌మే త‌న ల‌క్ష్యం అంటూ.. ద‌ళితుల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకుంటామంటూ టీడీపీ మేనిఫెస్టోలో సైతం పేర్కొని, అధికారంలోకి రాగానే ``ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా?`` అంటూ ద‌ళితుల‌ను అవ‌మానించిన చంద్ర‌బాబు, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో మ‌రోసారి ద‌ళితులను మోసం చేయ‌డానికి వారి జపం చేస్తున్నాడు. తాజాగా ప్రతి దళిత గడపకూ అభివృద్ధిని అందించడం కోసమంటూ చంద్రన్న ముందడుగు ‘దళిత తేజం-తెలుగుదేశం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే బాబు గ‌తంలో ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ చ‌ట్టాన్ని 100 శాతం స‌క్ర‌మంగా అమ‌లు చేస్తామ‌ని, అమ‌లు చేయ‌ని వారిని, అతిక్ర‌మించే వారిని శిక్షిస్తామ‌న్నారు. స‌బ్ ప్లాన్ చ‌ట్టాన్ని క‌నీసం 10 శాతమైనా అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబును ఇప్పుడు ఏం చేయాలి?...  ప‌రిశ్ర‌మ‌ల పేరుతో ద‌ళితుల ద‌గ్గ‌ర నుంచి స్వాధీనం చేసుకున్న అనైన్డ్ భూముల వివ‌రాల‌ను సేక‌రించి ద‌ళితుల‌కు ఇచ్చి న్యాయం చేస్తామ‌న్నాచంద్ర‌బాబు అధికారంలోకి రాగానే ద‌ళితుల‌కు భూములు ఇవ్వ‌క‌పోగా వారి భూముల‌ను లాక్కొని వారి నోట్లో మ‌ట్టికొట్టారు దీన్ని ఏమ‌నాలి? ఇది బాబు ద‌ళితుల‌కు చేస్తున్న ద్రోహం కాదా? ద‌ళితులుగా ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా అన్న బాబు మాట‌లు ద‌ళితులు మ‌రిచిపోయార‌నుకుంటున్నారా?.  ``ప్ర‌తి ద‌ళిత గ‌డ‌ప‌కూ అభివృద్ధిని తీసుకెళ‌దాం- ప్ర‌తి ద‌ళిత వాడ‌లో అంబేద్క‌ర్ జ్యోతిని వెలిగిద్దాం`` అని చెబుతున్న చంద్ర‌బాబు మాట‌ల్లో వాస్త‌వం ఎంత‌? అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేస్తున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు ఆ అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచిన మాట వాస్త‌వం కాదా? ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను వంద‌ల కోట్లు పెట్టి కొని వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌మ‌ని అంబేద్క‌ర్ రాజ్యాంగంలో చెప్పారా? త‌న అవ‌స‌రాల‌కు అంబేద్క‌ర్‌ను వాడుకుంటూ.. ద‌ళితుల‌ను మోసం చేస్తున్న బాబు ద‌ళిత తేజ‌మా?  రాష్ట్రానికి ప‌ట్టిన `చంద్ర‌` గ్ర‌హ‌ణ‌మా? ఇంకెన్నాళ్లీ మోసం?.
Back to Top