సైకో లక్షణాలన్నీబాబు కుటుంబంలోనే ఉన్నాయి..!

చంద్రబాబుపై అంబటి ఫైర్..!

వెఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వెఎస్సార్సీపీ సైకోపార్టీ అంటూ అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగడంపై అంబటి తీవ్ర ఆ్రగహం వ్యక్తంచేశారు. అసలు సైకో లక్షణాలన్నీచంద్రబాబులోనే ఉన్నాయని ధ్వజవెుత్తారు. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే వారే అసలు సైకోలని..అలాంటి లక్షణాలన్నీ టీడీపీ నేతల్లోనే ఉన్నాయని అంబంటి రాంబాబు ఎద్దేవా చేశారు.
 
అసలు సైకోలెవరో ప్రజలకు తెలుసు..
 హైదరాబాద్ ను నేనే నిర్మించా, దేశానికి సెల్ఫోన్  తీసుకొచ్చా, ప్రపంచానికి ఐటీని పరిచయం చేశానంటూ చెప్పుకునే చంద్రబాబు..... సైకో కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎప్పుడు మాట్లాడినా వేలెత్తి చూపే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్ లే అసలు సైకోలని అంబటి విమర్శించారు. ఇటీవల జపాన్ దేశంలో  పర్యటించిన చంద్రబాబు అక్కడ జనాభా లేరని... అత్యధిక జనాభా గల భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలు కనాలని చెప్పడం చంద్రబాబు సైకో అనడానికి నిదర్శనం కాదా అని అంబటి ప్రశ్నించారు. మానసిక స్థితి సరిగా లేని లక్షణాలు చంద్రబాబు కుటుంబంలో ఉన్నాయే తప్ప జగన్ కుటుంబంలో లేవన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై అసందర్భ ప్రేలాపనలు చేస్తే ప్రజలు, పార్టీ కార్యకర్తలు సహించరన్నవిషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
 
నిప్పులాంటి  మనిషినని చెప్పుకోవడం సిగ్గుచేటు..
ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపుల్లో మాట్లాడిన వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైనా...ఇంకా నేను నిప్పులాంటి మనిషినని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అంబటి రాంబాబు  దుయ్యబట్టారు.  ఓటుకు కోట్లు కేసులో చర్చకు పట్టుబడితే అందుకు అనుమతించకపోవడం బాధాకరమన్నారు. ఈవిషయంపై సభను పక్కదోవ పట్టించడవేు గాకుండా వైఎస్ జగన్ పై వ్యక్తిగత  విమర్శలు చేయడం దురదష్టకరమన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని సక్రమ మార్గంలో పనిచేయాలని అంబటి రాంబాబు ప్రభుత్వానికి సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top