వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ

హైదరాబాద్ :

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ప్రచార సరళి, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంవీ మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, దాడి వీరభద్రరావు, వైయస్‌ అనిల్‌రెడ్డిని ఈ కమిటీ సభ్యులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Back to Top