దిగ్బంధాన్ని సక్సెస్‌ చేసినందుకు కృతజ్ఞతలు

హైదరాబాద్, 7 నవంబర్ 2013:

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు 48 గంటల రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని వర్గాల వారికీ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. పార్టీ శ్రేణులు, స్థానిక జేఏసీలు, విద్యార్థులు, రైతులు అందరూ ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారని పేర్కొంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమంలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Back to Top