వైయస్‌ఆర్‌ సిపి రక్తదాన శిబిరాల పోస్టర్‌ విడుదల

హైదరాబాద్, ‌25 సెప్టెంబర్‌ 2012: జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ ఒకటవ తేదీన వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నది. ఈ శిబిరాలకు సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను మంగళవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి, కేంద్ర కార్యనిర్వాహక వర్గం సభ్యులు అంబటి రాంబాబు, కె.శివకుమార్, వైద్యవిభాగం రాష్ట్ర కన్వీన‌ర్ గోసుల శివభర‌త్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీన‌ర్ గట్టు రామచంద్రరావు, ఐటీ విభాగం కన్వీన‌ర్ చల్లా మధుసూద‌న్‌రెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పి.ఎన్.వి.ప్రసా‌ద్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రోజర్‌రొయిస్, డాక్టర్లు దత్తా శాంతివర్ధ‌న్, ఉదయభాస్క‌ర్, శివరాంనాయ‌క్, అశో‌క్, జి.ఎన్.కె.రెడ్డి‌, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Back to Top