వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుండి వ్యక్తం చేస్తున్న అనుమానాలకు నిరూపించేవిదంగా సీబీఐలో పనిచేసిన అధికారులు కాని సీబీఐ ఉన్నత స్దాయి అధికారులు కాని ఇతర కొంతమంది నిపుణలు కాని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు గత సీబీఐ ధర్యాప్తు మోదలైన తర్వాత జరుగుతున్న అనేక పరిణామాల నేపధ్యంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి సీబీఐ కేంద్రం హోంశాఖ డైరక్ష్‌న్‌లో ఎంపికచేసుకున్న వ్యక్తులపై దాడి అనే పద్దతిలో దర్యాప్తు జరుపుతుంది.అని మేము అరోపిస్తునట్టుగా సీబీఐ మాజి డైరక్టర్ జోగిందర్‌సింగ్ గారు అభిప్రాయాలు కాని ఇవ్వన్ని వస్తున్నట్టు గమనించాలి. సీబీఐ జగన్‌మోహన్‌రెడ్డి గారి విషయంలో దర్యాప్తు జరుపుతున్నటువంటి పద్దతి కాని చివరికి ఆ దర్యాప్తులో బాగం అనే పద్దతిలో ఈ రోజు సాక్షి మీడియా సంస్ధలని బ్యాంక్ ఖాతాలను దగ్గరనుండి సీబీఐ అనుసరిస్తున్నతీరు అనేక అనుమానాలకు తావిస్తుంది.ఇప్పుడు మరికొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. సీబీఐ ఆధారాలు లేకుండా ఎంతగా వేదిస్తుందో సామాన్య ప్రజలకు తెలియదు. కాని సీబీఐలో పనిచేసిన అధికారులక దాన్ని ఒక పాసుపతాస్త్రంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయం బాగా తెలుస్తుంది కనుకనే ఈ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ తో బాటు ప్రధాన పాత్ర పోషిస్తున్న మాజీ సీబీఐ డైరక్షర్ విజయరామారావు గారు ఇందులో ఉండి ఉండ వచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన శంకర్‌రావుగారు హై కొర్టుకు ఒక లేఖ రాస్తే ఆ లేఖకు ఇంప్లీడై తమకు సంభందంలేకపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది.ఈనాడు, ఆంధ్రజ్యోతిలో లీకులు రావడం, లీడ్స్ రావడం ధర్యాప్తును ఎలా లీడ్ చేయాలి అనే కధనాలు వస్తున్నాయి. సీబీఐ కేంద్ర హోం శాఖ మంత్రి డైరక్షన్ లో నడుస్తుంది. ఎంపికచేసుకున్న వ్యక్తుల మీద దాడి చేస్తుందని సీబీఐ మాజీలు చెప్తున్నారు. చంద్రబాబునాయుడు గారు చిదంబరాన్ని రహస్యంగా కలుసుకున్నారని బయట వ్యక్తం అయినప్పుడు స్యయంగా చిదంబరం గారే పార్లమెంట్ సాక్షి గా బయటపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి కి వస్తున్న ప్రజా స్పందనలో కాంగ్రెస్ పార్టీ కి అడ్రస్ ఉండదని ఈ సీబీఐ దర్యాప్తులు వేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పైన సీబీఐ ని ఎలా దుర్యినియోగం చేయాలో అన్ని విధ్యలు తెలిసిన ఒక అధికారి పాత్రలేకుండా ఇది జరిగేటటువంటిది కాదు. ఇక్కడ సీబీఐకి తోడుగా గతంలో సీబీఐ లో పనిచేసిన తెలుగుదేశం పార్టీనాయకుడు ఉన్నట్టు వ్యక్తమవుతుంది.చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి గారి కేసుల విషయంలో సీబీఐ చాల చక్కగా పనిచేస్తుందని అంటున్నారు. మేము అడుగుతున్నాం సీబీఐ మీద మీకు నమ్మకం ఉంటే మీరు మీ మీద స్యచ్చందంగా ఎంక్వరి వేయించుకోండి. ఏంక్వరిలో మీరునిజాయితి పరులు అని తేలితే మా మాటలను వెనక్కి తీసుకుంటాం.