స్పీకర్‌ : అంబటిరాంబాబు, శ్రీమతి రోజా - మే 27,2012

గత రెండు రోజులుగా రాష్ట్రంలో ప్రజలందరు ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. ఉదయమే జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ఎంక్వరికి వెళ్ళివచ్చే వరకు రాష్ట్ర ప్రజలందరు ఎదురుచూస్తున్నారు. ఈవాతవరణం చూస్తుంటే రాజశేఖరరెడ్డి గారు హెలికాప్టర్‌ మిస్‌ అయిన సమయంలో  ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఉత్కంటతో ఎదురుచూచారో ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.జగన్‌మోహన్‌రెడ్డి ని సీబీఐ వేదిస్తుంటే కొన్ని గుండెలు అగిపోతున్నాయి పోలీసులు పధకం ప్రకారం వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌చేసి ఇంట్లోనుండి తీసుకువెళ్ళారు. పోలీస్‌ స్టేషన్‌లో కెమేరా ముందు బలవంతంగా కూర్చోబెట్టి స్కిఫ్ట్‌ రాసి చదివించి ఆ విడియోని ఎన్నడు లేని విధంగా యూట్యూబ్‌లో పెట్టి వారే లింకులను మెసేజ్‌ చేస్తున్నారు. అతను తప్పుచేసాడు అంటే మీడియా ముందుకుతీసుకువచ్చి మాట్లాడించవచ్చు కదా.? నాంపల్లి కోర్టు దగ్గర 144 సెక్షన్‌ రెండు నెలలుపాటు విధించారు అంటా.. నేను అడుగుతున్నా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమైన నిషిద్ద సంస్ధ, అన్ని పార్టీలాగానే వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యంగా ఎర్పడిన పార్టీ.ఒటమి ఎరుగుకుండా ప్రజల్లో విశ్వాసం  పోందుతున్న పార్టీ ఒక నిషిద్ద సంస్ధలాగా ట్రీట్‌ చేస్తున్నారు...మేము పోలీస్‌ వారికి ఈ సంధర్బంగా విజ్ఞప్తి అనుకోండి  హెచ్చరిక  అనుకోండి ఒకటి చెప్పదలుచుకున్నా ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు, అలాగే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా లేదు.రేపు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీనే ప్రజల మద్యలో నుండి పుట్టుకువస్తుంది. విజయవాడలోవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ లో నలుగురు ఉండడానికి వీలులేదట...అక్కడ పోలీస్‌ బందోబస్త్‌ పెట్టి కార్యకర్తలను లోనికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని బందించాలని చూస్తే బెదిరిపోతామని అనుకోవద్దు అని చెబుతున్నా. పిల్లిని గదిలోపెట్టి కొడితే ఎమవుతుంది. ఎదురుతిరుగుతుంది, కాని మీరు పులినే గదిలోపెట్టికోట్టడానికి ప్రయత్నంచేస్తున్నారు పంజా విసురుతుంది 12 వ తారీఖూనా. ఆ పంజా దెబ్బకి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పలియనం చిత్తగించవలసిన పరిస్దితి వస్తుంది.పోలీస్‌ యంత్రాగాన్ని ఉపయోగించి  జగన్‌మోహన్‌రెడ్డిని అణచాలి అనుకుంటే ప్రజస్వామ్యయుతంగా తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో.....


రోజా.మాట్లాడుతూ.........   

లగడపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిగారిని విజయమ్మగారు సరిగా పెంచలేదని మాట్లాడుతున్నారు. ఏ తల్లి అయిన ప్రయోజకుడు అయిన తన బిడ్డని వేరేవాళ్ళు ఇబ్బందులకు గురిచేస్తుంటే లేదా వేదిస్తుంటే ఈ తల్లి మనసు కరిగిపోతుంది.దైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదరణ కలిగిన ఒకనాయకుడిని ఈరోజు ఎదో చేస్తామని సింహం ముందు చిట్టేలుకాలా ఆటలాడుతున్నారు. 

కాంగ్రెస్‌వారుతెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నట్టుగా రెచ్చగోట్టే అవసరం మాకులేదు. జగన్‌మోహన్‌రెడ్డిగారికి విజయమ్మగారికి నీతులు చెప్పే నాయకుడు ఎవరులేరు. లగడపాటి మాట్లాడుతూ మాట తప్పడు, మడమ తిప్పడు,మూట విప్పడు అని మూట విప్పి ఒట్లు తెచ్చుకునే గత్యంతరం వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకీ లేదు. 

రాజశేఖరరెడ్డి గారు చనిపోయినప్పడు కొన్ని గుంటనక్కలు పండగచేసుకున్నాయి.ఇప్పుడు అవి భయటకువచ్చి ఉళలువేస్తున్నాయి.రాజకీయంగా కాంగ్రెస్‌. తెలుగుదేశం పార్టీకి పతనం జూన్‌ 12 ప్రారంభం ఆరంభం అవుతుంది.
Back to Top