శ్రీకాకుళం జిల్లాలో రేపు విజయమ్మ పర్యటన

హైదరాబాద్, 15 అక్టోబర్ 2013:

పై లిన్‌ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ బుధవారం పర్యటిస్తారు. పెను తుపాను గండం గడిచినా దాని ప్రభావం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల్లోని జీడి, కొబ్బరి, అరటి, వరి, కూరగాయలు ఇతర పంటలు ధ్వంసం అయ్యాయి. పంట నష్టపోయిన ప్రాంతాల్లో శ్రీమతి విజయమ్మ పర్యటిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Back to Top